Movie News

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా హనుమాన్ అంశ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాభై రోజులకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ముంబై, అహ్మదాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో వీకెండ్ వస్తే చాలు టికెట్లు దొరకనంతగా తెగ ఆడేస్తోంది. ఆగస్ట్ నుంచి హిందీ వెర్షన్ హైదరాబాద్ లోనూ నాన్ స్టాప్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొంత లేట్ అయినా తెలుగు డబ్బింగ్ అక్టోబర్ 9 తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

హోంబాలే ఫిలిమ్స్ ఈ బాధ్యతను తీసుకుంది. ఏపీ తెలంగాణ కలిపి సుమారు పధ్నాలుగు కోట్లకు హక్కులు డీల్ అయినట్టు ట్రేడ్ రిపోర్ట్. దీంట్లో అధికంగా ఏపీ 9 కోట్లు, తెలంగాణ 5 కోట్లు పలికాయట. రిటర్న్ పద్దతిలో తీసుకున్నారు కాబట్టి ఒకవేళ నష్టం వచ్చినా బయ్యర్లకు ఇబ్బంది ఉండదు. ఆడిందంటే మటుకు లాభాల పంట ఖాయం. అయితే హిందీ థియేటర్ రన్ దాదాపు పూర్తయి ఓటిటిలో రావొచ్చేమోననే ప్రచారం జరుగుతున్న టైంలో హనుమాన్ అంశ్ డబ్బింగ్ చేశారు.

ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి. ఎందుకంటే నగరాలు, పట్టణాల్లో హనుమాన్ అంశ్ ఈపాటికి పెద్ద సంఖ్యలో చూశారు. హిందీ సినిమాలు అలవాటు లేని ఆడియన్స్ మటుకు థియేటర్లకు వెళ్ళలేదు. వాళ్ళను కనక ఇప్పుడీ సినిమా రప్పించగలిగితే కాసుల వర్షం కురుస్తుంది. బడా డిస్ట్రిబ్యూటర్లు ఇన్వాల్వ్ కావడం వల్ల స్క్రీన్ల సమస్య పెద్దగా ఉండదు. ఆదర్శ కుటుంబం తప్పుకుని కామ్రేడ్ కళ్యాణ్ ఒకటే రేసులో ఉండటం అతి పెద్ద సానుకూలాంశం.

ప్రాక్టికల్ గా చూస్తే నీమ్ కరోలి బాబా మనకు ప్రసిద్ధులు కాదు. మరి ఏ మేరకు కనెక్ట్ అవుతారనే అనుమానం రాక మానదు. అయితే ఇది కేవలం ఆయన బయోపిక్ అనే కోణంలో కాకుండా ఆధ్యాత్మికతకు ఉన్న బలాన్ని చూపించడంలో దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది సక్సెస్ కావడంతో ప్రేక్షకులు విపరీతంగా చూశారు. మరి తెలుగులోనూ అంత ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి. దసరా టైంలో చాలా సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో హనుమాన్ అంశ్ కు భారీ ఆశీర్వాదమే దక్కాలి.

This post was last modified on October 6, 2026 7:11 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

7 hours ago