Movie News

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఒక ప్యాన్ ఇండియా మూవీ తనే నిర్మాతగా తీయబోతున్నానని నాని అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. రక్తం ముంచిన చేతులతో హీరో డైరెక్టర్ ఒక ఫోటో షూట్ చేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. వాటిని చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. గాల్లో తేలిపోయి ఏవేవో ఊహించుకుని మేడలు కట్టేశారు.

తీరా చూస్తే ప్యారడైజ్ అనుకున్న దానికన్నా చాలా ఆలస్యమయ్యింది. షూటింగ్ జరుగుతున్న టైంలో నెగటివ్ ప్రచారాలు జరిగాయి. రిలీజయ్యాక నాని ఏకంగా ట్రోలింగ్ చూడాల్సి వచ్చింది. నైజామ్ మినహాయించి ఎక్కడా లాభాలు కాదు కదా కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా కష్టమనిపించేలా రిజల్ట్ వచ్చింది. ఎంతో కొంత పుష్ చేయడానికి టీమ్ ట్రై చేసింది కానీ సాధారణ ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురయ్యింది. ఇదంతా నిన్నటి దాకా జరిగిన గతం ప్లస్ పాత కథ.

వర్తమానానికి వద్దాం. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ చిరు ఓదెల ప్రాజెక్టు ఇప్పట్లో ఉండదని, ఒకవేళ ప్యారడైజ్ కనక లేట్ కాకపోయి ఉంటే మెగా మూవీని ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసేవాళ్లమని, ఈలోగా చిరంజీవి వేరే కమిట్ మెంట్స్ ఇవ్వడంతో ఇప్పట్లో ఇది జరిగే ఛాన్స్ లేదనే రీతిలో డైరెక్ట్ గానే హింట్ ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ ఓదెలతో ప్రయాణం కొనసాగుతుందని, తనకెంతో నచ్చిన దర్శకుల్లో ఒకడని చెప్పి ఇద్దరి బాండింగ్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

సో మెగాభిమానులు ఇక రిలాక్స్ అవ్వొచ్చు. అయితే ప్యారడైజ్ ఫలితం ఎలా ఉన్నా దసరా దర్శకుడికి మెగా మాస్ పడితే ఎలా ఉంటుందో చూడాలని మూవీ లవర్స్ చాలా మంది కోరుకున్నారు. పైగా ఓదెల వ్యక్తిగతంగా చిరు వీరాభిమాని. అది కూడా చిన్నప్పుడు స్కూల్ వయసు నుంచే. సో కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడేవాడు. కానీ ఇప్పుడు ప్యారడైజ్ వల్ల అది స్వప్నంగా ఉండిపోతుందా లేక భవిష్యత్తులో మరో సమయంలో ఈ కాంబోకి శ్రీకారం చుట్టబడుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on October 6, 2026 10:25 pm

Share

Recent Posts

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

47 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

53 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

57 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

6 hours ago