Political News

స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీలోని ఆశావ‌హుల‌కు అంద‌రికీ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ఆశావ‌హుల‌ను నిరాశ‌ప‌రిచే ప్ర‌స‌క్తి లేదన్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌నిచేసేందుకు ఇప్ప‌టి నుంచే నాయ‌కులు, కార్య‌కర్త‌లు సంసిద్ధులు కావాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. ముఖ్యంగా పార్టీ బ‌లంగా ఉన్న చోట ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి బ‌లంగా ఉండాల‌న్న ఉద్దేశంతో 21 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యామ‌ని నాదెండ్ల వ్యాఖ్యానించారు. అయితే, ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌బోవ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పార్టీ ప‌రంగా బ‌లంగా ఉన్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే స్థానికంగా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌న్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల‌పై పార్టీ నాయ‌కులు, కేడ‌ర్ కూడా చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వీరిని సంతృప్తి ప‌రిచేందుకు పార్టీ అన్ని ర‌కాల చ‌ర్యలు తీసుకుంటుంద‌న్నారు. అదేస‌మ‌యంలో కూట‌మి ఔన్న‌త్యాన్ని ఎప్ప‌టికీ కాపాడుకుంటామ‌న్నారు. కూట‌మి నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచేందుకు త‌మ వంతు కృషి జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యాన్ని అంద‌రూ పాటిస్తార‌న్నారు.

ఐక్యంగానే ముందు..

కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఐక్యం గానే స్థానిక సంస్థ‌లు స‌హా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ముందుకు సాగుతామ‌న్నారు. ఈ విష‌యంలో రెండో మాటేలేద‌ని చెప్పారు. అయితే, స్థానికంగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డం కూడా పార్టీకి ప్ర‌ధాన బాధ్య‌త‌గా పేర్కొ న్నారు. అందుకే.. స్థానిక ఎన్నిక‌ల్లో సాధ్య‌మైన‌న్ని స్థానాల‌లో పోటీ చేయాల‌ని భావిస్తున్నామ‌న్నారు. 

This post was last modified on July 17, 2026 5:50 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

1 hour ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

3 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

3 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

5 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

6 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

7 hours ago