రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ నగరం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. నిత్యం వేలాది మంది వచ్చి పోయే ఈ నగరానికి ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం మాత్రమే ఉంది. గతంతో పోలిస్తే నగర జనాభాతో పాటు ప్రతిరోజు నగరానికి వచ్చి పోయేవారి సంఖ్య పెరిగింది. అయితే, ఎప్పుడైనా భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, నగరంలో ఏదైనా నిషేధాజ్ఞలు విధించాల్సి వచ్చినా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటూ ఉండేవారు.
అయితే, కొన్ని సార్లు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఇకపై, అటువంటి సమస్య లేకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఎంస్ నం.198 జారీ చేసింది. ఇప్పటి దాకా ఎస్పీ ఆఫీసు మాత్రమే ఉన్న రాజమహేంద్రవరంలో ఇకపై పోలీస్ కమిషనరేట్ రానుంది. ఇకపై, విజయవాడ, విశాఖ నగరాల మాదిరిగా రాజమండ్రికి కూడా పోలీస్ కమిషనర్ రాబోతున్నారు.
అయితే, కొత్తగా పోలీస్ కమిషరేట్ వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి బడ్జెట్ ఏమీ కేటాయించలేదు. పోలీస్ కమిషనర్ గా డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారిని నియమించనున్నారు. తూ.గో జిల్లా పరిధిని మూడు ప్రాదేశిక జోన్లుగా విభజించబోతున్నారు. అయితే, కమిషనరేట్ లో కొత్త పోస్టులు క్రియేట్ చేయకుండా ఉన్న వారితో సర్దుబాటు చేస్తున్నారు. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ పోస్టును రాజమండ్రి కమిషనర్ పోస్టుగా మార్చారు. ఆల్రెడీ ఎస్పీలుగా పనిచేస్తున్న వారిని డీసీపీలుగా మార్చారు.
This post was last modified on October 6, 2026 10:16 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…