2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా చిరంజీవి కూడా ఈ విషయంలో కాకాకే మద్దతు పలకడంతో నిర్మాతలు వేరే ఆప్షన్ చూసే పనిలో పడ్డారు. నవంబర్ లో వస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి కానీ ఓటిటి సంస్థ దానికి అనుకూలంగా లేదని టాక్. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం జనవరి లేదా దాని తర్వాత తప్ప అంతకన్నా ముందు వద్దని చెబుతున్నారని అంతర్గత సమాచారం.
సో నెక్స్ట్ స్లాట్స్ వైపు చూస్తే శివరాత్రి పండగ వచ్చే మార్చి వైపు మెగా టీమ్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడో రిస్క్ ఉంది. ఆల్రెడీ మార్చి 5 ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా లాక్ చేసి పెట్టారు. దాని స్థానంలో ఫౌజీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం నగర్ ఆల్రెడీ కోడై కూస్తోంది. కాకపోతే రెండు యూనిట్ల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో వీటిలో దేనితో అయినా క్లాష్ అవ్వడం విశ్వంభరకు సేఫ్ కాదనేది ఓపెన్ ఫాక్ట్.
లేదంటే మార్చ్ 19 ఎంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒకవేళ ఇది మిస్ అయితే కష్టం. ఏప్రిల్ లో వారణాసి ఉంటుంది కాబట్టి దానికన్నా కనీసం రెండు మూడు వారాల ముందు వస్తేనే విశ్వంభరకు రిస్క్ తగ్గుతుంది. రాజమౌళి ఈసారి వాయిదా ప్రసక్తే రాకుండా కష్టపడుతున్నారు కాబట్టి పోస్ట్ పోన్ గురించి ఆశలు పెట్టుకోకపోవడం ఉత్తమం. విశ్వంభరకు ఈ స్లాట్ సాధ్యం కాకపోతే ఇక వేసవికి వెళ్లడం తప్ప వేరే ఛాయస్ ఉండదు. జూన్ లో డ్రాగన్ వస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు.
దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. విశ్వంభర డేట్ ఫిక్స్ అయ్యాక మళ్ళీ ట్రాక్ లోకి వస్తారని టాక్. ఇంకా విడుదల చేయాల్సిన పాటలున్నాయి. వాటిలో భీమ్స్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ ఉంది. గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని వారాల క్రితమే పూర్తయ్యిందట. ఫైనల్ కాపీని చిరంజీవితో పాటు టీమ్ మొత్తం మరోసారి చూశాక తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. అయితే అది కూడా ఓటిటి నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని వినికిడి.
This post was last modified on October 6, 2026 5:11 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…