Movie News

సూప‌ర్ హిట్ సీక్వెల్… సైలెంటుగా రెడీ

టాలీవుడ్లో ఏ అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సర్పైజ్ హిట్ట‌యిన కొన్ని సినిమాలున్నాయి. అలాంటిదే.. 2018లో విడుద‌లై హుషారు సినిమా. అందులో పేరున్న యాక్ట‌ర్లు లేరు. ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌వాడే. ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా కొత్త‌దే. వీళ్లంతా క‌లిసి యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే ఎంట‌ర్టైన‌ర్ అందించి హిట్టు కొట్టారు. ఈ సినిమాతో ఎక్కువ పేరొచ్చింది ద‌ర్శ‌కుడు శ్రీ హ‌ర్ష కొనుగంటికే.

దీంతో ఆ త‌ర్వాత దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. కానీ వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రౌడీ బాయ్స్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీని త‌ర్వాత గ్యాప్ తీసుకున్న శ్రీ హ‌ర్ష‌.. ఇప్పుడు తన డెబ్యూ మూవీకి సీక్వెల్‌తో రాబోతున్నాడు. సైలెంటుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న హుషారు-2 త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని ఈ రోజే అనౌన్స్ చేశారు.

ఒక యానిమేటెడ్ డిజైన్‌తో తీర్చిదిద్దిన హుషారు-2 ఫ‌స్ట్ పోస్ట‌ర్ చూస్తే.. ఈసారి ఈ వ‌ర‌ల్డ్ పెద్ద‌గానే ఉండ‌బోతోందని అర్థ‌మ‌వుతోంది. మ‌రోసారి క‌బుమ్ డ్రింక్ క‌థ‌లో కీల‌కంగా ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చారు. క్షీర సాగ‌ర మ‌థ‌నాన్ని సూచిస్తూ.. ఈసారి ఇంకా పెద్ద స్థాయిలో క‌బుమ్ డ్రింక్ చేయ‌డానికి హీరోల గ్యాంగ్ ప‌డే పాట్ల‌ను చూపించ‌బోతున్నార‌ని అర్థమ‌వుతోంది. కాన్సెప్ట్ పోస్ట‌ర్లో ఒక వ‌న‌క‌న్య‌, బంగారు నిధితో కూడిన పెట్టె కూడా క‌నిపిస్తున్నాయి. దీన్ని బ‌ట్టి సినిమాలో ఫాంట‌సీ యాంగిల్ కూడా ఉంటుంద‌నిపిస్తోంది.

హుషారు-1లో తేజస్ కంచ‌ర్ల, తేజ్ కూర‌పాటి, దినేష్ తేజ్, అభిన‌వ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. వాళ్ల‌ను అలాగే పార్ట్-2లో కూడా కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్ రామ‌కృష్ణ పాత్ర కూడా కొన‌సాగే అవ‌కాశ‌ముంది. హీరోయిన్లు మారే ఛాన్సుంది. హుషారు-2ను హుషారు ప్రొడ్యూస‌ర్స్ కాకుండా వేరే నిర్మాత‌లు ప్రొడ్యూస్ చేసిన‌ట్లున్నారు. న‌వంబ‌రు లేదా డిసెంబరులో హుషారు-2ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

This post was last modified on October 6, 2026 8:48 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

19 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

26 minutes ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

5 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

9 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago