Political News

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిమీద కూటమి పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. మీడియాలో మాత్రం రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ 80 శాతం, జనసేన, బీజేపీ 20 శాతం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ చెప్పారని ఒక వర్గం ప్రచారం చేయడం తెలిసిందే. అదంతా ఒట్టి పుకార్లే అని ఖండించిన కూటమి నాయకులు ఇప్పుడు చర్చలు ప్రారంభించారు.

స్థానిక సమరానికి కూటమి సిద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య అమరావతిలో భేటీ జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే అనేకమార్లు సమావేశమై సమన్వయంపై చర్చలు జరిపిన నేపథ్యంలో అగ్రనేతల మధ్య జరిగిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో ఎవరు ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలన్న అంశంతో పాటు సీట్ల సర్దుబాటు, కూటమి బలాబలాలు, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన సీట్ల షేరింగ్ ఇప్పుడు కుదరదని ఖరా ఖండిగా చెబుతూ వస్తున్నారు. ఈరోజు భేటీలో కూడా అదే విషయం ప్రస్థావించినట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరికి బలమున్న చోట వారు పోటీ చేయాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇది ఎంతవరకు సాధ్యమౌతుందో తెలియదు. కానీ టీడీపీ 75 శాతం, జనసేన, బీజేపీ 25 శాతం సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

జనసేన కార్యకర్తలు మాత్రం అనేక డిమాండ్లు చేస్తున్నారు. జనసేనకు ఐదు మేయర్ స్థానాలు కేటాయించడానికి ఇరువురు నాయకులు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతి స్థానాలు జనసేనకు కేటాయించేందుకుసీఎం చంద్రబాబు అంగీకరించినట్లు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తున్నారు. అయితే ఈరోజు తొలి దశ చర్చలు మాత్రమే జరిగాయని, తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారికంగా తెలుస్తుంది.

This post was last modified on October 6, 2026 10:22 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

28 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

54 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

57 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

6 hours ago