నిజమే… నాణేనికి రెండు వైపులూ ఉంటాయి. నాణెం ఎప్పుడూ ఒక వైపుతోనే ముద్రించబడదు. నాణేనికి ఓ వైపు బొమ్మ ఉంటే… మరోవైపున బొరుసు కూడా ఉంటుంది. అయితే మెజారిటీ సమాజం ఆ నాణేనికి ఉన్న బొమ్మను మాత్రమే గుర్తిస్తూ… బొరుసును గుర్తించదు. ఇది అసంకల్పితమే అయినప్పటికీ… బాధ్యత గల ప్రజా ప్రతినిధులు అయినా, అదికారులు అయినా… బొమ్మతో పాటు బొరుసునూ గుర్తిస్తారు. తొలుత తాము బొరుసును గుర్తించని వైనాన్ని నిజాయతీగా ఒప్పుకుంటారు. అదే సమయంలో బొరుసు బయటపడిన తీరును కూడా వారు ఏమాత్రం సంకోచించకుండా సమాజానికి వెలిబుచ్చుతారు.
అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి.. రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్న మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో వెలుగుచూసిన ఘటన ఇది. హైదరాబాద్ మహా నగర పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనర్ గా భగవత్ ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో స్వయంగా భగవతే ఈ విషయాన్ని వెల్లడించారు. కేసు నమోదు, నిందితుల అరెస్టు, ఆ తర్వాత చోటుచేసుకున్న ట్విస్టులను ఆయన ఆసక్తికరంగా వివరించారు. అంతేకాకుండా సదరు కేసు దర్యాప్తులో బాగంగా తొలుత తాము పొరబడిన విషయాన్నీ ఆయన ఒప్పుకున్న తీరు నిజంగానే ఆసక్తికరమని చెప్పక తప్పదు.
భగవత్ రాచకొండ సీపీగా ఉన్న సమయంలో ఓ యువతి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ ఆటో డ్రైవర్ తో పాటు నలుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా భగవత్ టీం నిందితులను పట్టేసింది. అయితే విచారణలో తామెలాంటి తప్పు చేయలేదని నిందితులు చెప్పారు. అంతేకాకుండా తాము తప్పు చేసినట్టు ఏ ఒక్క ఆధారమూ లేదని, ఆ యువతే తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిపారు. నిందితులు పదే పదే అదే విషయాన్ని చెబుతుండటంతో భగవత్ వారి వైపు నుంచి ఆలోచించారు.
కేసులో ఆధారాలను భగవత్ మరోమారు పరిశీలించారు. కేసులో కీలకమైన సీన్ రీకన్ స్ట్రక్షన్ ను చేపట్టారు. అక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితులు చెప్పినట్లుగా రేప్ ఏమీ జరగలేదని, బాధితురాలు నిందితుల్లోని ఓ ఆటో డ్రైవర్ పై కక్షపూరితంగానే ఈ కేసు పెట్టిందని గుర్తించారు. ఇంకేముంది… బాదితురాలిని పిలిపించిన భగవత్…ఆమెను అన్ని కోణాల్లో మరోమారు విచారించారు. ఈ సందర్భంగా యువతి తన తప్పును ఒప్పేసుకుంది. ఆటో రుసుము చెల్లింపు సందర్భంగా ఆటో డ్రైవర్ తో తగాదా జరగగా… దానిపై కక్షసాధించేందుకే తాను అతడితో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. దీంతో భగవత్ యువతిని మందలించి… నిందితులను వదిలిపెట్టేశారు.
అక్కడితోనే ఆగిపోయి ఉంటే… ఇదసలు కేసే కాదు. చాలా మంది దర్యాప్తు అదికారులు నిజం తేలింది కదా ఇక వదిలేద్దామనుకుంటారు. మరి అకారణంగా రేపిస్టులు అని ముద్ర పడిన ఆ నలుగురి పరిస్థితి ఏమిటి? ఆ దిశగానే ఆలోచించిన భగవత్… మీడియా సమావేశం పెట్టి మరీ ఆ నలుగురు నిందితులు మంచివారేనని, వారిపై అకారణంగానే రేపిస్టులు అనే ముద్ర పడిందని చెప్పారు. ఆ నలుగురు రేపిస్టులు ఎంతమాత్రం కాదని… వారు సమాజంలో మంచి పౌరులని పేర్కొని మరీ వారిని వదిలిపెట్టారు. అక్కడితో ఆ కేసు క్లోజ్ కాగా… ఇప్పుడు ఆ నలుగురు కూడా మంచిగానే జీవితం సాగిస్తున్నారు.
This post was last modified on July 4, 2026 2:10 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…