Movie News

ఫ్యామిలీస్ రాకపోయినా రికార్డులు గ్యారెంటీనా?

యశ్ సోలో హీరోగా నాలుగేళ్ల తర్వాత చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా ఇంత పెద్ద స్టార్ సినిమా అంటే ఫ్యామిలీస్ కూడా చూసేలా ప్లాన్ చేస్తారు. 

కానీ టీమ్ మాత్రం ఫస్ట్ నుంచి ఇది పెద్దల కోసం మాత్రమే అంటూ హింట్స్ ఇస్తూనే వస్తోంది. ఒకప్పుడు ఎంత పెద్ద హీరో సినిమాకైనా ఏ సర్టిఫికెట్ వస్తే బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ అనే ఫీలింగ్ ఉండేది. 18 ఏళ్ల లోపు వాళ్లకు ఎంట్రీ ఉండదు కాబట్టి, వాళ్లతో పాటు వచ్చే ఫ్యామిలీస్ మొత్తం సినిమాకు దూరమవుతారు. అందుకే బడ్జెట్ భారీగా ఉన్నప్పుడు కలెక్షన్స్ సేఫ్ గా రాబట్టడానికి కొంచెం వైలెన్స్, బోల్డ్ సీన్స్ ఉన్నా సరే కట్ చేసి యు/ఏ తెచ్చుకోవడానికి ట్రై చేసేవాళ్లు. 

ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమనే లెక్కలు ఉండేవి. కానీ రణబీర్ కపూర్ యానిమల్ ఆ పాత లెక్కలన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా కొల్లగొట్టింది. A సర్టిఫికెట్ పడితే కలెక్షన్స్ కు బ్రేకులు పడతాయనే భయాన్ని ఆ సినిమా పూర్తిగా పోగొట్టింది.

యానిమల్ దారిలోనే 2025లో వచ్చిన రణవీర్ సింగ్ ధురంధర్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా A సర్టిఫికెట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా సరే ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. స్టార్ డమ్, స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే అడల్ట్ మార్క్ అనేది ఆడియన్స్ ను థియేటర్లకు రాకుండా ఆపలేదని ఇండస్ట్రీకి రెండోసారి గట్టిగా ప్రూవ్ అయింది. ఇప్పుడు యశ్ టాక్సిక్ కూడా ఎక్కడా దాపరికాలు లేకుండా ఓపెన్ గా అదే రూట్ లో వెళ్తోంది. 

ప్రమోషన్స్ లో ఇంటిమేట్ సీన్స్, వైలెన్స్ లాంటివి దాచే ప్రయత్నం అసలు చేయలేదు. ఫ్యామిలీస్ ను ఎట్రాక్ట్ చేయడం కంటే, యశ్ కు ఉన్న క్రేజ్ తో యూత్ ను అడల్ట్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు ఈ ప్రమోషన్స్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఆ సర్టిఫికెట్ వస్తే ఇక కలెక్షన్స్ కు ఢోకా లేదు అని గుడ్డిగా ఫిక్స్ అవ్వలేం. ఒక వర్గం ఆడియన్స్ ముందే దూరమవుతారు, పైగా మూడు గంటల పైన రన్ టైమ్. మరి టాక్సిక్ కంటెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

This post was last modified on August 17, 2026 10:33 am

Share

Recent Posts

2025 లెక్కలు సరి చేస్తున్న నిర్మాత

టాలీవుడ్లో మంచి అభిరుచి, సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ కి మంచి పేరుండేది. కానీ ఆ పేరు గత…

33 minutes ago

ఇరుముడి వేడుకలో పంటి కింద రాళ్ళు

ఇరుముడి అనే చాలా పవిత్రమైన టైటిల్ పెట్టి సినిమా తీశాడు శివ నిర్వాణ. రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్…

1 hour ago

జివి ప్రకాష్ మేజిక్ టచ్ సరిపోవట్లేదు

ప్రస్తుతమున్న సంగీత దర్శకుల్లో టయర్ 2 సినిమాలకు ఎక్కువ అందుబాటులో ఉండి, తక్కువ టైంలో పని పూర్తి చేసి ఇచ్చేది…

2 hours ago

వార‌ణాసి కోసం ఇంకో ద‌ర్శ‌కుడు?

అదేంటి.. వార‌ణాసి సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు క‌దా, ఆయ‌న‌తో పాటు ఈ చిత్రానికి మ‌రో డైరెక్ట‌ర్ ప‌ని చేయ‌డం ఏంటి…

4 hours ago

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

7 hours ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

10 hours ago