Movie News

ఇరుముడి వేడుకలో పంటి కింద రాళ్ళు

ఇరుముడి అనే చాలా పవిత్రమైన టైటిల్ పెట్టి సినిమా తీశాడు శివ నిర్వాణ. రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది టీం. ఈ వేడుకలో పంటి కింద రాళ్ళ లాగా కొన్ని బూతులు దొర్లడం వివాదాస్పదం అయింది. ఇటు నటుడు అజయ్ ఘోష్.. అటు రవితేజ ఇద్దరూ నోరు జారేశారు.

ముందుగా స్టేజ్ మీదికి వెళ్ళడానికి ముందు కింద కుర్చీలో కూర్చుని ఉన్న రవితేజను యాంకర్ కొన్ని సరదా ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా ఈ చిత్రంలో తన కూతురిగా కీలక పాత్ర చేసిన బాల నటి నక్షత్ర గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగితే.. రవితేజ ‘ముదురు ము.. డ’ అనేశాడు. అంటే ఏంటి అని ఆ చిన్నారి అడిగితే తర్వాత చెప్తా అని సమాధానం దాటవేశాడు మాస్ రాజా.

మరోవైపు అజయ్ ఘోష్ స్టేజ్ మీద ప్రసంగించేటపుడు.. మాస్ రాజాతో మాస్ జాతర షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో రవితేజకు చెందిన తోటలోనే జరిగిందని, ఒకప్పుడు కేవలం 12 లక్షల రూపాయలతో ఆ తోట కొంటే ఇప్పుడది వందల కోట్లు అయిందని, దాని గురించి రవితేజతో చెప్తే.. “ఒరేయ్ ఎరి.. మనం వెళ్ళిపోతాం, మనతో పాటు ఇవేవీ ఉండవు. మనం వాటిని చూసి ఆనందించాలి తప్ప పని ఆపకూడదు” అంటూ రవితేజ జీవిత సత్యం విధించినట్లు అజయ్ ఘోష్ చెప్పాడు.

అంతటితో ఆగకుండా రవితేజ తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే, అందరికీ పని కల్పిస్తూనే ఉంటాడని చెప్తూ అజయ్ ఘోష్ “హిట్టు, ఫ్లాపు తీసి అవతల దె*వోయ్” అంటూ పెద్ద బూతు మాట వాడడంతో ఆడిటోరియం గొల్లుమంది. తర్వాత రవితేజ మాట్లాడేటపుడు ఆ బూతులేంటయ్యా బాబు అంటూ అజయ్ ఘోష్ ను సరదాగా మండలిస్తూనే కరెక్ట్ ఎమోషన్లో మాట్లాడాడని వ్యాఖ్యానించాడు.

This post was last modified on August 17, 2026 10:12 am

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

8 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago