Movie News

35 రోజులకే బుల్లితెరపై పెద్ది

35 రోజులంటే థియేటర్ రన్ పరంగా చూసుకుంటే మంచి నెంబర్ అనిపిస్తుంది కానీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్న సినిమాకు ఇది తక్కువే నిడివే. ఏపీ తెలంగాణలో మంచి రన్ తెచ్చుకుని ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాల్లో చేతులు ఎత్తేసిన పెద్ది జూలై 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే సరిగ్గా అయిదు వారాల తర్వాతన్న మాట. తొలుత జూలై 16 అనే ప్రచారం జరిగింది కానీ హఠాత్తుగా ప్రకటన ఇవ్వడం ద్వారా ఓటిటి కంపెనీ సర్ప్రైజ్ ఇచ్చింది.

విడుదలకు ముందు ఏదైతే హైప్ నెలకొందో దాన్ని పెద్ది పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లి చేసిన ప్రమోషన్లకు తగ్గట్టు వసూళ్లు రాలేదు. ఓవర్సీస్ లో అయిదు మిలియన్ మార్కు అందుకోలేకపోవడం మెగా ఫ్యాన్స్ చిన్నతనంగా ఫీలవుతున్నారు. నిర్మాతలు చెప్పిన ప్రకారం నాలుగు వందల కోట్లు దాటడం నిజమే అనుకున్నా అభిమానులు కోరుకున్న ఫైవ్ హండ్రెడ్ మార్క్ చేరుకోకపోవడం వాళ్లకు అసంతృప్తిని కలిగించింది.

ఒకవేళ మా ఇంటి బంగారం కనక సక్సెస్ కాకపోయి ఉంటే పెద్దికి ఇంకొంచెమా అడ్వాంటేజ్ దక్కేదేమో కానీ సమంత ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండు వారాలు పూర్తిగా డామినేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ కు పెద్ది కీలకం కానుంది. తెలుగు కన్నా ఎక్కువగా ఇతర బాషల వ్యూస్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. కన్నడ, తమిళ, మలయాళంతో పాటు హిందీలో చూసిన జనాలు తక్కువ కావడంతో వాళ్ళందరూ ఓటిటి షోలు వేసుకుంటే వేగంగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది.

పెద్ది కోసం విపరీతంగా కష్టపడిన రామ్ చరణ్ ఇటీవలే లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ది ప్రమోషన్స్ పూర్తి చేసి రెండు నెలలు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. సుకుమార్ తో స్క్రిప్ట్ ఇంకో వారం రెండు వారాల్లో లాక్ కానుంది. అన్నీ చూసుకుని ఓపెనింగ్ డేట్ అనౌన్స్ చేస్తారు. రెండు భాగాలుగా తీస్తారనే ప్రచారం ఆల్రెడీ ఊపందుకుంది. పెద్ది దర్శకుడు బుచ్చిబాబుకే రామ్ చరణ్ మరో ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

This post was last modified on July 4, 2026 1:21 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago