Movie News

బుచ్చిబాబు కథలు.. ఎంత మంది హీరోలో…

‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న హీరోల లిస్ట్ చూస్తే మాత్రం చిన్నది కాదు. ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ గురించి మాట్లాడుతూ తాను జీవితంలో మొదట రాసుకున్న కథే ఆయన కోసమని బుచ్చిబాబు చెప్పాడు. ఇప్పటికీ ఆ కథ తన దగ్గరే ఉందని, రవితేజకు చెప్పాలని ఉందని చెప్పడంతో మరో కొత్త కాంబినేషన్ పేరు బయటకు వచ్చింది.

బుచ్చిబాబు ప్రయాణంలో ఇలాంటి కథలు ముందూ ఉన్నాయి. ‘ఉప్పెన’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి కొంతకాలం ట్రావెల్ అయ్యాడు. అయితే అది ముందుకు వెళ్లలేదు. తర్వాత రామ్ చరణ్ దగ్గరకు ‘పెద్ది’ వెళ్లింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు చెప్పిన కథనే చరణ్‌తో తీశాడనే ప్రచారాన్ని బుచ్చిబాబు స్వయంగా ఖండించాడు. రెండూ పూర్తిగా వేర్వేరు కథలని ఆయన క్లియర్ చేశాడు.

‘పెద్ది’ రిలీజ్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పేరు వచ్చింది. తన దగ్గర మరో బలమైన కథ ఉందని చెప్పిన బుచ్చిబాబు, ఎన్టీఆర్ పిలిస్తే వెంటనే వెళ్లి కథ చెబుతానని కూడా అన్నాడు. ఇదే సమయంలో మహేష్ బాబు పేరు కూడా బుచ్చిబాబు చుట్టూ తిరిగింది. ‘పెద్ది’ టైమ్ లో మహేష్‌ కోసం ఉందా అని అడిగితే ఆయన కన్ఫర్మ్ చేయలేదు, అలాగని పూర్తిగా కొట్టిపారేయలేదు. సరైన టైమ్ కోసం వెయిట్ చేద్దామనే సమాధానం ఇచ్చాడు.

ఇప్పుడు రవితేజ పేరు కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటిలో ప్రతి హీరో కోసం ఒకే కథను తిప్పుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎన్టీఆర్ కథ వేరు అని బుచ్చిబాబు చెప్పాడు. రవితేజ కోసం మొదట్లోనే రాసుకున్న మరో కథ ఉంది. ‘పెద్ది’ని రామ్ చరణ్ కోసమే రాసుకున్నానని కూడా చెప్పాడు. అంటే ఆయన కథల బ్యాంక్ ముందే తయారై ఉన్నట్టుంది. ‘ఉప్పెన’ తర్వాత రెండో సినిమా రావడానికి బుచ్చిబాబుకు ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు ‘పెద్ది’ తర్వాత మళ్లీ అంత గ్యాప్ రావాలని ఆయన కూడా కోరుకోకపోవచ్చు. మరి నెక్స్ట్ ఎవరితో ఫిక్స్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 17, 2026 12:20 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

16 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago