టాలీవుడ్లో మంచి అభిరుచి, సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ కి మంచి పేరుండేది. కానీ ఆ పేరు గత ఏడాది బాగా దెబ్బ తింది. కొన్ని నెలల వ్యవధిలో వరుస డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు నాగవంశీ. నిరుడు జులైలో ఈ బేనర్ నుంచి ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది. ఆ చిత్రానికి నాగవంశీ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. చివరికి చూస్తే సినిమాలో ఆయన చెప్పినంత ఏమీ లేదని అర్థమైంది.
ఇక ఆగస్టులో తన బేనర్ నుంచి రిలీజ్ చేసిన హిందీ చిత్రం ‘వార్-2’ గురించి కూడా ఇలాగే గొప్పలు పోయాడు నాగవంశీ. అది మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ సినిమా ‘మాస్ జాతర’తో ఇంకో షాక్ తిన్నాడు. ఐతే 2026 మాత్రం ఈ నిర్మాతకు మంచి ఫలితాలనే ఇస్తోంది. గత ఏడాది నష్టాలన్నింటినీ ఈ సంవత్సరం భర్తీ చేస్తోంది.
సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ మూవీతో నాగవంశీకి అత్యావశ్యక విజయాన్నందుకున్నాడు. ఇది ఆయనకు బిగ్ రిలీఫ్. ఫిబ్రవరిలో ‘ఫంకీ’తో కాస్త దెబ్బ తిన్నా.. ఇప్పుడు నెల వ్యవధిలో రెండు పెద్ద హిట్లు ఖాతాలో వేసుకున్నాడు నాగవంశీ. గత ఏడాది ‘కింగ్డమ్’ రిలీజైన జులై నెలలోనే ఇప్పుడు ‘లెనిన్’ వచ్చింది. అది పెద్ద హిట్టే అయింది. ఇక నిరుడు ఆగస్టులో వచ్చిన ‘వార్-2’ బాకీని.. ఈ ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తీర్చేస్తోంది. ‘వార్-2’ లాగే ఇది కూడా పర భాషా చిత్రం కావడం విశేషం.
అప్పుడు ‘వార్-2’కు హిందీలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్లు ఇవ్వాలని ఆడియన్స్‌ను డిమాండ్ చేస్తే లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అలా అడక్కపోయినా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్లు ఇస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇలా 2025 లెక్కలన్నింటినీ ఈ ఏడాది భర్తీ చేసేస్తున్నాడు నాగవంశీ. సెప్టెంబరులో ఆయన్నుంచి ‘ఎపిక్’ రాబోతోంది. సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తూ.. గత ఏడాది ‘మాస్ జాతర’ బాకీని ఇది తీర్చేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 17, 2026 11:03 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…