దెబ్బ మీద దెబ్బ, ఆర్థిక మాంద్యం, అస్తవ్యస్తం… ఇపుడు భూకంపం

అమెరికా సంయుక్త రాష్ట్రాల‌కు పొరుగున ఉన్న వెనుజులా బుధ‌వారం సాయంత్రం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు సంభ‌వించిన భూకంపాల‌తో ఒక్క‌సారిగా చివురుటాకులా వ‌ణికి పోయింది. భారీ భూకంపం ధాటికి భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. ప్ర‌పంచంలోనే తొలిసారి ఇంత పెద్ద భూకంపం సంభవించిన‌ట్టు అమెరికా భూగ‌ర్భ శాస్ట్ర విభాగం పేర్కొంది. ఈ ప్ర‌మాదంలో వేల మంది పౌరులు మృతి చెంది ఉంటార‌ని తెలిపింది. భ‌వ‌నాల శిధిలాల కింద శ‌వాల‌గుట్ట‌లు పేరుకుపోయిన ఫొటోల‌ను ఈ విభాగం పోస్టు చేసింది.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి

క‌నీ వినీ ఎరుగ‌ని భూకంపం కార‌ణంగా వేల మంది మృతి చెందిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా.. వెనుజులా ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే.. దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించిన తీరును చూస్తే.. భారీగానే ప్రాణ‌న‌ష్టం సంభ‌వించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తం రెండు సార్లు మాత్ర‌మే భూమి కంపించినా.. దాని ప్ర‌కంన‌లు మాత్రం 20 సార్లు ప్ర‌భావం చూపించాయ‌ని వెనుజులా పేర్కొంది. ముఖ్యంగా అత్యంత జ‌న‌స‌మ‌ర్థంగా ఉండే మెక్వేషియా ప్రాంతంలో భూకంపం రావ‌డంతో ప్రాణ న‌ష్టం ఎక్కువ‌గా సంభ‌వించిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు.. బుధ‌వారం దేశంలో సెల‌వు దినం కావ‌డంతో ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఇళ్లలోనే ఉన్నారు కార్యాల‌యాలు, బ్యాంకులకు కూడా సెల‌వు కావ‌డంతో ఈ ప్ర‌మాదం తీవ్ర‌త ప్ర‌జ‌ల‌పైనే ఎక్కువగా ఉంద‌ని అంటున్నారు. అందుకే.. ప్రాణ‌న‌ష్టం కూడా ఎక్కువ‌గా జ‌రిగింద‌న్న అంచ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన భూకంపాల‌తో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం వ‌చ్చిన భూకంపం తీవ్రత ఎక్కువ‌గా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

దేశ‌వ్యాప్తంగా..

దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ విధించ‌డంతో పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. విమానాశ్ర‌యాల‌ను మూసి వేశారు. వెనుజులాకు వ‌చ్చే విమానాల‌ను వెనక్కి పంపేశారు. ప్ర‌జ‌లు త‌మ ప్ర‌యాణాల‌ను మానుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. ప్ర‌స్తుతం స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్యానిక్ వార్త‌ల‌ను న‌మ్మ‌రాద‌ని ప్ర‌భుత్వం సూచించింది.