Trends

వీకెండ్ పార్టీలో విగత జీవిగా టెకీ

సాప్ట్ వేర్ రంగమంతా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే… ఫుల్ ఎంజాయ్ మెంట్ లోకి దిగిపోతోంది. శని, ఆదివారాలు రెండు రోజులూ ఇల్లు కూడా గుర్తుకు రానంతగా జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఓ వీకెండ్ పార్టీకి వెళ్లిన ఓ యువ టెకీ పార్టీలోనే విగత జీవిగా మారిపోయాడు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా… ఈ టెకి మృతి మాత్రం మిస్టరీగానే మారిపోయింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. రామాంతపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అతడు సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ అంటేనే… వారాంతాల్లో ఎంజాయ్ మెంటే కదా. అదే బాటన రాము పనిచేస్తున్న సంస్థ కూడా సాగింది. ఆ కంపెనీలోని తన సహోద్యోగులతో కలిసి రాము వీకెండ్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

వీకెండ్ పార్టీని వీరంతా కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా అంతా కలిసి ఆ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. శనివారం సాయంత్రం మొదలైన ఈ పార్టీ ఆ రోజు అర్దరాత్రి దాకా కొనసాగినట్లు సమాచారం. పోలీసులకు ఏమాత్రం సమాచారం లేకుండానే ఈ పార్టీని నడుపుకున్న వీరంతా… చివరలో రాము ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో రాము అచేతనావస్థలో కనిపించడంతో షాక్ తిన్నారు.

ఎలాగోలా రామును స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు తీసుకువచ్చినా కూడా అతడిలో చలనం కనిపించలేదు. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా… అప్పటికే రాము చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫలితంగా ఆ బ్యాచ్ సమాచారాన్ని పోలీసులకు చేరవేయక తప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు రాము మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి… ఫామ్ హౌస్ ను పరిశీలించారు.

ఇదిలా ఉంటే… వీకెండ్ పార్టీలో ఎంజాయ్ కోసం వచ్చి విగత జీవిగా మారిన రాము శరీరంపై కొన్నిచోట్ల గాయాలు కనిపించినట్లు సమాచారం. దీంతో రామును అతడి స్నేహితులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో దిగిన తర్వాతే అతడు ఊపిరాడక చనిపోయి ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీంతో మిస్టరీ డెత్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టారు.

This post was last modified on June 15, 2026 12:57 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

58 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago