Political News

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నానికి వ‌స్తున్న జాతీయ‌, అంత‌ర్జాతీయ విమానాలు ఇక ఆదివారం అర్ధ‌రాత్రి తర్వాత నుంచి అల్లూరి విమానాశ్ర‌యానికే రానున్నాయి. ఈ మేర‌కు విమాన‌యాన సంస్థ షెడ్యూల్‌ను నిర్దేశించింది. దీంతో భోగాపురం విమానాశ్ర‌యంలో అధికారికంగా కార్యక‌లాపాలు సోమ‌వారం తెల్ల‌వారు జాము నుంచి ప్రారంభం అవుతాయి.

ఫ‌స్ట్ ఫ్లైట్ సింగ‌పూర్ నుంచే..

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యంలో పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా విశాఖపట్నం విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ నుంచి నడిచే అన్ని విమానాలు ఇకపై భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి.

ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా తమ సర్వీసుల షెడ్యూల్‌ను విడుదల చేశాయి. వీటి ప్ర‌కారం సింగపూర్ నుంచి వచ్చే `స్కూట్ ఎయిర్‌లైన్స్` తొలి విమానం ఆదివారం అర్ధ‌రాత్రి 12.11 నిమిషాల‌కు భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవుతుంది. ఇండిగో సర్వీసులు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక్క ఇండిగోనే తొలి రోజు 35 విమానాల‌ను భోగాపురం నుంచి ప్రారంభించ‌నుంద‌ని అధికారులు తెలిపారు.

చంద్ర‌బాబు సంతోషం..

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు.. సింగ‌పూర్‌కు ఉన్న అనుబంధం తెలిసిందే. అమ‌రావ‌తి రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను ఆ దేశ‌మే ఇచ్చింద‌ని.. దీనికి ఒక్క రూపాయి కూడా చార్జి తీసుకోలేద‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాదు.. ఆయ‌న ప‌లు మార్లు ఆ దేశంలో ప‌ర్య‌టించారు. అమ‌రావ‌తికి సంబంధించిన ప‌లు అంశాల్లో సింగ‌పూర్ ప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సింగ‌పూర్ నుంచి వ‌చ్చే విమాన‌మే భోగాపురంలో కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నుండ‌డం విశేషం.

దీనిపై చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. ఉత్త‌రాంధ్ర‌కు మంచి రోజులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలిపారు. మ‌రోవైపు ఆదివారం అర్ధ‌రాత్రి భోగాపురానికి చేరుకునే సింగ‌పూర్ విమానానికి సంప్ర‌దాయ బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు కూడా పాల్గొంటారు.

This post was last modified on August 16, 2026 10:48 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

38 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago