Trends

ఆగని ‘పెట్రో’ బాదుడు.. 10 రోజుల్లో 7 రూపాయలు…

దేశంలో మరోమారు ఇంధన ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పై దాదాపుగా రూ.3 మేర పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చేసింది. అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలలోనే మూడు దఫాలుగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆదివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు…నాలుగో సారి కూడా ఇంధన ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. అనుకున్నదే తడవుగా పెట్రోల్ ధరను లీటర్ కు రూ.2.61 మేర పెంచిన కంపెనీలు.. డీజిల్ థరలను లీటర్ కు రూ.2.71 మేర పెంచాయి. ఫలితంగా నాలుగో సారి ఇంధన థరలు భారీగానే పెరిగినట్టు అయ్యింది.

ఒక్క నెలలోనే వరుసగా నాలుగు పర్యాయాలు ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. నాలుగో సారి సోమవారం ఉదయం నుంచి పెరిగిన థరల తర్వాత ఏపీలో పెట్రోల్ ధర రూ.117.19ను తాకగా… తెలంగాణలో ఈ థర రూ.115.58కి చేరుకుంది. వరుసబెట్టి చమురు కంపెనీలు ఇంధన థరలను పెంచుతున్న కారణంగా ఈ నెలలోనే పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ.6 నుంచి 7 దాకా పెరగగా… డీజిల్ ధర కూడా అంతే స్థాయిలో పెరిగిందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే… పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడే దిశగా పొదుపు చర్యలను కూడా ఆయన సూచించారు. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల ఇదేమీ చివరిది కాదని, సమీప భవిష్యత్తులోనే మరికొన్ని సార్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

This post was last modified on May 25, 2026 7:48 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

2 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

3 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

7 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

9 hours ago