Movie News

సమంతకు విజయ్ గండం తప్పదేమో

చాలా గ్యాప్ తీసుకుని సమంత చేసిన సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు సామ్ భర్త రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్నారు. వాస్తవానికి ఇది మే 14 రిలీజ్ కావాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో జూన్ 19కి వెళ్లిపోయారు. దానికన్నా ముందు జూన్ 4 ఆప్షన్ అనుకున్నారు కానీ ఉన్నట్టుండి పెద్ది ఆ డేట్ లాక్ చేసుకోవడంతో వేరే మార్గం లేక వాయిదా తీసుకున్నారు.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ మా ఇంటి బంగారంకి గండం అయిపోలేదు. కొత్తది వచ్చేలా ఉంది. విజయ్ జన నాయకుడుకి సెన్సార్ నుంచి రూట్ క్లియర్ అయినట్టుగా చెన్నై సమాచారం. నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జూన్ 19 విడుదలకు ఛాన్స్ ఉందని కోలీవుడ్ బయ్యర్లకు ప్రాధమికంగా చెప్పేశారని వినికిడి. అంటే సరిగ్గా మా ఇంటి బంగారం వచ్చే రోజన్న మాట. తెలుగులో ఇబ్బంది లేదు కానీ తమిళ వెర్షన్ కు పెద్ద కాంపిటేషన్ అవుతుంది.

అసలే వారం తర్వాత మే 29 అఖిల్ లెనిన్ ఉంది. సో మరోసారి వాయిదా వేసుకోవాలంటే స్క్రీన్ల పరంగా సమస్య తప్పదు. జన నాయకుడు ఇచ్చిన కట్స్ పోను ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా వచ్చిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ తో మాట్లాడి అప్పుడు నిర్ణయం వెల్లడిస్తారని అంటున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ జన నాయకుడిని ప్రకటించడంతో అంచనాలు మాములుగా లేవు.

భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి మన దగ్గర విజయ్ మూవీ ఏదో అద్భుతం చేసే అవకాశం లేదు కానీ ఒకవేళ మా ఇంటి బంగారంని కనక తమిళ మలయాళ వెర్షన్లలో రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం విజయ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఇబ్బందవుతుంది. జానర్ పరంగా చూసుకుంటే రెండింటికి పోలిక లేదు కాబట్టి రిస్క్ చేయొచ్చు కానీ ఎటొచ్చి సరిపడా థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. ట్రైలర్ లాంచ్ కు రెడీ అవుతున్న మా ఇంటి బంగారంలో అసలేముందో బయటపడేది దాంట్లోనే.

This post was last modified on May 24, 2026 11:02 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

2 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

4 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago