Political News

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న వాద‌న వినిపిస్తోంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ముస్తాఫా ఒత్తిడికి త‌లొగ్గిన పార్టీ.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తెకు అవ‌కాశం ఇచ్చింది. ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. పార్టీకేడ‌ర్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంతో ఆమె విఫ‌ల‌మ‌య్యారు. అంత‌ర్గ‌త వివాదాల‌తో ముందుకు సాగుతున్నారు.

మ‌రోవైపు పొగాకు వ్యాపారానికి సంబంధించి తాజాగా చేసిన త‌ప్పు.. ముస్త‌ఫాను జైలు పాలు చేసింది. ఈ ప‌రిణామం మైనారిటీ వ‌ర్గాన్ని కూడాకుదిపివేయ‌డంతో వారు కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి ముస్త‌ఫా అంటే.. మైనారిటీ వ‌ర్గాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఇటీవ‌ల వెలుగు చూసిన కిడ్నాప్ వ్య‌వ‌హారంతో ఆయ‌న పేరు మ‌స‌క బారింది. ఫ‌లితంగా తూర్పులో వైసీపీ గ‌త ప్ర‌భావాన్ని పూర్తిగా కోల్పోయింద‌న్న వాద‌న పార్టీలో వినిపిస్తోంది. ఈ కేసు నుంచి ముస్త‌ఫా బ‌య‌ట‌ప‌డినా.. ఆయ‌న‌కు ఏమేర‌కు సానుభూతి ద‌క్కుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇక‌, గుంటూరు వెస్ట్‌లో కూడా.. వైసీపీ వేసిన ఒకే ఒక్క అడుగు తీవ్ర విప‌రిణామాల‌కు దారితీసింది. వ్యాపార వ‌ర్గాలు, సంప‌న్న వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో విజ‌యం ద‌క్కించుకున్న మ‌ద్దాలి గిరిధ‌ర్‌ను 2024 ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌కుండా త‌ప్పించి పార్టీ త‌ప్పు చేసింద‌న్న వాద‌న వినిపించింది. అంతేకాదు.. ఎన్నో ఆశ‌ల‌తో ఇక్క‌డ పోటీ చేసిన ఆనాటి మంత్రి ర‌జ‌నీ కూడా ఐపు లేకుండా పోయారు. దీంతో ప‌శ్చిమ ప‌రిస్థితి కూడా కొరుకుడు ప‌డ‌డం లేదు.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీకి ఒక‌ప్పుడు.. బ‌లంగా ఉండ‌గా.. ఇప్పుడు మైన‌స్ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. టీడీపీ త‌ర‌ఫున విజ‌యం దక్కించుకున్న ప‌శ్చిమ‌, తూర్పు ఎమ్మెల్యేలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అదే స‌మ‌యంలో వైసీపీ కేడ‌ర్ కూడా ఆయా ఎమ్మెల్యేల‌కు జై కొట్ట‌డం మ‌రో దెబ్బ‌గా మారింది. మొత్తంగా గుంటూరు ప‌డ‌మ‌ర‌- తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ఇప్పుడు బిగ్ టెస్టే ఎదురు కానుంది. మ‌రి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

This post was last modified on August 15, 2026 4:09 pm

Share

Recent Posts

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

13 minutes ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

3 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

3 hours ago

విశ్వనాథ్ గెలిస్తే క్రెడిట్ తెలుగు ప్రేక్షకులదే

కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి…

4 hours ago

ఇరుముడికి ఎలాంటి ఇరుకు లేదు

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ…

6 hours ago

బొమ్మరిల్లు హాసిని… విశ్వనాథ్ మ్యాడీ

వరల్డ్ బిల్డింగులు, ఎలివేషన్లు, గ్యాంగ్ స్టర్ డ్రామాలు నిండిపోయిన ట్రెండ్ లో హీరోల డామినేషన్ తోనే కథలు రాస్తున్న దర్శకులు…

6 hours ago