Political News

పొద్దున్నే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొద్దుపొద్దున్నే కార్యరంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం ఉదయం 7 గంటలు దాటకముందే రంగంలోకి దిగిపోయారు.

రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం ఆదివారం రాత్రికే నగరం చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోనే బస చేసిన పవన్… సోమవారం ఉదయం 7 గంటలకే తన పర్యటనను ప్రారంభించారు. స్థానిక అధికారులు వెంట రాగా… పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ల పనుల పరిశీలనను మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల ఏర్పాటుకు సంబంధించి కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ పనుల కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా నదిలో పేరుకుపోతున్న కాలుష్య కారకాలను పరిశీలించిన పవన్ కల్యాణ్… వాటిని తొలగించే చర్యలపై అధికారులతో చర్చించారు. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు, వాటి అమలు తీరుపైనా పవన్ దృష్టి సారించారు.

పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో కాలుష్య రహితంగా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలన్న దిశగా పవన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.

This post was last modified on May 25, 2026 8:55 am

Share

Recent Posts

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

45 minutes ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

3 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

3 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

4 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

6 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

7 hours ago