Trends

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌లివి. 2024లో టీమ్ ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలవ‌గానే రోహిత్ శ‌ర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోవ‌డంతో సూర్య‌కుమార్ ప‌గ్గాలందుకున్నాడు. అప్ప‌ట్నుంచి భార‌త్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు.

కానీ సూర్య‌కుమార్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. కెప్టెన్‌గా విజ‌యాలందుకుంటున్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా త‌యార‌వ‌డంతో అత‌డిపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌లేదు. మ‌రోవైపు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐపీఎల్‌తో పాటు దేశ‌వాళీ క్రికెట్లోనూ అద‌ర‌గొడుతున్నా.. అత‌డికి భార‌త‌ టీ20 జ‌ట్టులో చోటే లేదు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ట్రోఫీ అందించాడు. త‌ర్వాతి ఏడాది అంద‌రూ వేస్ట్ అని తేల్చేసిన‌ పంజాబ్ కింగ్స్ లాంటి జ‌ట్టును ఫైన‌ల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా పంజాబ్ అత‌డి సార‌థ్యంలో రాణిస్తోంది.
ఇంకెప్పుడు శ్రేయ‌స్‌ను భార‌త‌ టీ20 జ‌ట్టులోకి తీసుకుంటారు.. ఎప్పుడు కెప్టెన్‌ను చేస్తారు అని అభిమానులు గ‌గ్గోలు పెడుతుండ‌గా.. ఎట్ట‌కేల‌కు సెల‌క్ట‌ర్ల‌లో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే అత‌ణ్ని జ‌ట్టులోకి తీసుకోవ‌డ‌మే కాదు.. కెప్టెన్‌ను కూడా చేయ‌బోతున్నార‌ట‌. వ‌చ్చే నెల చివ‌ర్లో టీమ్ ఇండియా ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అక్క‌డ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాక‌.. ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్క‌డ ఐదు టీ20లు ఆడుతుంది. ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న నుంచే శ్రేయ‌స్ టీ20 కెప్టెన్ అవుతాడ‌ట‌.

ఒకేసారి జ‌ట్టులో చోటివ్వ‌డం, కెప్టెన్‌ను చేయ‌డం జ‌రుగుతాయ‌ట‌. మ‌రోవైపు సూర్య‌కుమార్ అంత‌ర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసిన‌ట్లే అంటున్నారు. అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ తేలిపోతున్నాడు. ముంబ‌యి త‌ర‌ఫున వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నాడు. అత‌డికి వ‌య‌సు పెరిగింది. ఫామ్ పోయింది. దీంతో ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ట్టును విజేత‌గా నిలిపిన‌ప్ప‌టికీ సూర్య‌పై వేటు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

This post was last modified on May 9, 2026 8:06 am

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

3 hours ago