తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ మార్పులు పెను ప్రభావానికి దారి తీయడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎలాగైనా ఎన్డీఏ కూటమిని గద్దె దించే దిశగా ఇండియా కూటమి రథసారథి కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు పరిణామాలు ఆదిలోనే హంసపాదులా పరిణమిస్తాయన్న వాదనలు బలపడుతున్నాయి. తమిళనాడు పరిణామాలు కాంగ్రెస్ కు భారీ నష్టాన్ని మిగిల్చడంతో పాటు అధికార ఎన్డీఏకు భారీ ఊరటను ఇవ్వనున్నట్టుగా సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) 107 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు 11 సీట్లు అవసరం కాగా… ఐదు దశాబ్దాలుగా డీఎంకేతో సాగుతున్న మైత్రిని తెంచేసుకున్న కాంగ్రెస్… టీవీకేకు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంతో డీఎంకే తనదైన శైలిలో స్పందించింది. కాంగ్రెస్ తో ఇక జట్టు కట్టేది లేదని తేల్చి చెప్పిన డీఎంకే… కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చునేందుకూ ఆ పార్టీ ఎంపీలు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు పెద్దగా నష్టం చేయకున్నా…వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం భారీ నష్టాన్నే మిగిల్చనుందని చెప్పాలి.
డీఎంకేకు ప్రస్తుతం లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకే సహా ఇతర మిత్రపక్షాల సభ్యులను కలుపుకుంటే… కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం 232గా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగిన మూడో పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటికి వెళితే… ఇండియా కూటమి బలం ఒక్కసారిగా 210కి పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 100 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో 22 మంది ఎంపీలు కలిగిన డీఎంకేను ఆ పార్టీ దూరం చేసుకోవడం ద్వారా ఇండియా కూటమిని కాంగ్రెస్సే మరింతగా బలహీనం చేసుకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు లేకున్నా… మూడేళ్ల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే 20కి పైగా స్థానాలను గెలిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ…డీఎంకేకు సీట్లు తగ్గినా… ఆ మేర సీట్లను టీవీకే గెలుచుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పక దప్పదు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ లెక్కన టీవీకే కొన్ని సీట్లు గెలిచినా… డీఎంకే గెలిచే సీట్లు మాత్రం ఈ దఫా కాంగ్రెస్ కూటమికి జత కావని చెప్పాలి.
ఇక డీఎంకేతో పొత్తు నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో 9 సీట్లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు డీఎంకే మద్దతు లేకుండా కాంగ్రెస్ బరిలోకి దిగితే… ఆ పార్టీకి 9 సీట్లు కాదు కదా.. కనీసం ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదనే చెప్పాలి. ఇక విజయ్ కి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఎం, సీపీఐలకు లోక్ సభలో ఇద్దరేసి సభ్యులు ఉన్నారు. ఈ పార్టీల నుంచి కాంగ్రెస్ కు మద్దతు దక్కినా… అది కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసివచ్చే అవకాశం లేదనే చెప్పాలి. మొత్తంగా విజయ్ కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన బలాన్ని తానే భారీగా తగ్గించుకుందన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి.
This post was last modified on May 9, 2026 6:16 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…