Trends

గెట్ టు గెదర్ పార్టీలు.. పాత స్నేహితులతో కామం?

ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో ‘గెట్ టు గెదర్’ పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పదేళ్ల క్రితం విడిపోయిన స్కూల్ బ్యాచ్‌ల నుంచి ముప్ఫై, నలభై ఏళ్ల కిందటి పాత విద్యార్థుల వరకు అంతా సోషల్ మీడియా ద్వారా ఒక్కటవుతున్నారు. పాత రోజులను గుర్తుచేసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం వరకు ఈ వేడుకలు బాగానే ఉంటున్నాయి. కానీ, ఈ కలయికల చాటున కొన్ని అనవసరమైన గొడవలు, దారుణమైన నేరాలు కూడా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా ఇలాంటి పార్టీల్లో పాత పరిచయాలు మళ్ళీ మొదలై, అవి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. పెళ్లై, పిల్లలు ఉన్న వారు కూడా పాత ప్రేమలను వెలికితీసి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇలాంటి బంధాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, అవి చివరికి హత్యలు లేదా ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ కూడా పాత మిత్రుడి పరిచయంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న పిల్లలనే చంపేసిన ఉదంతం అందరినీ భయపెట్టింది.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ గెట్ టు గెదర్ పార్టీల తాలూకు దుష్పరిణామమే అని తెలుస్తోంది. తన భార్య పాత స్నేహితుడితో సన్నిహితంగా ఉండటం, ఆ విషయం భర్తకు తెలియడంతో మనస్తాపం చెంది అతను ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఇవి బయటకు వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కలయికల వల్ల మనస్పర్థలు వచ్చి, బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు, లోలోపలే సర్దుకుపోతున్న భార్యాభర్తలు కూడా ఎందరో ఉన్నారు.

పాత స్నేహితుల కలయికలో హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ఒక్క వ్యక్తి ప్రాణమే కాదు, మొత్తం కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. కేవలం పార్టీల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని అనలేం కానీ, ఆ పేరుతో పాత ప్రేమలను గుర్తుచేసుకొని కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియాలో నిరంతరం టచ్‌లో ఉండటం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. తాత్కాలిక సంతోషం కోసం తీసుకునే నిర్ణయాలు జైలుపాలు చేయడం లేదా ప్రాణాలు తీయడం వరకు వెళ్తున్నాయి.

This post was last modified on May 5, 2026 4:18 pm

Share

Recent Posts

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

43 minutes ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

1 hour ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

1 hour ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

3 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

3 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

5 hours ago