Movie News

‘పెద్ది’కి ఉన్న ఏకైక అడ్వాంటేజ్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ‘పెద్ది’తో మరోసారి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలను పాన్ ఇండియా స్థాయిలో మెప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. కానీ ఈసారి చరణ్ టీమ్ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.

జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఉత్తరాది మార్కెట్‌లో ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. చరణ్‌కు హిందీ బెల్ట్‌లో ఉన్న క్రేజ్‌ని వాడుకుంటూ, అక్కడ ఎటువంటి పెద్ద సినిమాలు లేకుండా క్లియర్ మార్గాన్ని మేకర్స్ సెట్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర భాషల్లో కూడా ప్రస్తుతం ‘పెద్ది’కి గట్టి పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. కేవలం బాగుందనే టాక్ వస్తే చాలు, వసూళ్ల వేట ఆగడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని, అందులోనూ పల్లెటూరి ఇంటెన్సిటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేవలం ఒక యాక్షన్ సినిమా లాగా కాకుండా, ఎమోషన్స్ కూడా పక్కాగా కుదిరితే చరణ్ కెరీర్‌లో ఇది మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటికే రెహమాన్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిపోయింది.

అయితే పాన్ ఇండియా సక్సెస్ అనేది కేవలం విడుదల చేసే భాషల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కంటెంట్ ఎంత బలంగా ఉందనేది ఇక్కడ ముఖ్యం. ‘పెద్ది’కి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఖాళీగా ఉన్న విండో. జూన్ మొదటి వారంలో ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి, ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

కానీ ఆ తర్వాత రన్ కొనసాగాలంటే సినిమాలోని ఇంటెన్సిటీ నార్త్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అవ్వాలి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మైత్రీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్‌గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇక కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

This post was last modified on May 5, 2026 12:46 pm

Share

Recent Posts

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

1 hour ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

3 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

4 hours ago