Trends

మ‌న శ‌త్రువు.. ప్ర‌పంచానికి మిత్రుడైతే!

శ‌త్రువులో సైతం మంచి ల‌క్ష‌ణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భార‌త్ సొంతం. రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌తాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే.. మ‌నం కొన్ని కార‌ణాల‌తో మ‌న దాయాదిదేశం పాకిస్థాన్ ను మెచ్చుకోలేక పోవ‌చ్చు. కానీ, అన్ని విష‌యాల్లోనూనా? అంటే.. కాదు!. కేవ‌లం రెండు ప్ర‌ధాన కార‌ణాల‌తోనే పాక్‌ను భార‌త్ వ్య‌తిరేకిస్తోంది. 1) ఉగ్ర‌వాద ప్రోత్సాహం. 2) క‌శ్మీర్ భూభాగం.

తాజాగా పాకిస్థాన్‌కు ప్ర‌పంచ దేశాల నుంచి ఊహించ‌ని ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్న ఇరాన్ యుద్ధాన్ని ఇప్ప‌టికి రెండు సార్లు వాయిదా వేయించ‌డంలో పాకిస్థాన్ చేసిన దౌత్యం ఫ‌లించ‌డ‌మే దీనికి కార‌ణం. గ‌తంలో 5 రోజులు.. ప్ర‌స్తుతం రెండు వారాల పాటు అమెరికా యుద్ధాన్ని నిలుపుద‌ల చేసేలా.. పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీప్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. అమెరికాకు భార‌త్‌-పాక్ మిత్ర‌దేశాల‌న్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇరాన్ యుద్ధంలో భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని తీసుకుంది. ఎవ‌రికీ ఏమీ చెప్ప‌లేదు. ఉమ్మ‌డి శాంతి మంత్రం ప్ర‌వ‌చించింది. కానీ, పాకిస్థాన్ ఈవిష‌యంలో ప్రోయాక్టివ్ రోల్ పోషించింది.(ఇది ప్ర‌శంస కాదు). ఇరాన్‌-అమెరికాలు రెండు కూడా పాకిస్థాన్‌కు మిత్ర దేశాలే. దీంతో ఆది నుంచి కూడా ఇరు దేశాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించింది. దీనిలో భాగంగానే ఇటీవ‌ల ట్రంప్‌.. 5 రోజుల పాటు విరామం ప్ర‌క‌టించారు. మ‌రోసారి.. ఆయ‌న కారాలు మిరియాలు నూరుతూ.. అణుయుద్ధానికి సంకేతాలు ఇచ్చారు.

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి.. పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్‌.. స‌హా ఆదేశ సైనికాధికారులు రంగంలోకి దిగారు. అటు ఇరాన్‌, ఇటు అమెరికాల‌తో సంయుక్త చ‌ర్చ‌లు జ‌రిపారు. యుద్ధం వ‌ద్ద‌ని వారించారు. హోర్ముజ్ జ‌ల‌సంధిని తిరిగి తెరిపించే బాధ్య‌త తీసుకున్నారు. అదేస‌మ‌యంలో అమెరికాను నిలువ‌రించేలా చేశారు. ఈ విష‌యాన్ని ట్రంపే త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

దీంతో ప్ర‌స్తుతం రెండు వారాల పాటు ప్ర‌పంచానికి కునుకు ప‌ట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల‌ను ఉటంకిస్తూ.. పాకిస్థాన్‌పై ప్ర‌పంచ దేశాలు.. ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నాయి. మంచి ఎవ‌రు చేసినా.. మంచే కాబ‌ట్టి.. మ‌న‌కు శ‌త్రువు అయినంత మాత్రాన‌.. అన్నింటినీ వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం.. హ్ర‌స్వ దృష్టితో చూడాల్సిన అవ‌స‌రం లేదుక‌దా!… అంటున్నారు భార‌త్‌లోని ప‌లువురు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు.

This post was last modified on April 8, 2026 10:20 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago