ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక కొత్త డేట్ గురించి నిర్మాతల వైపు నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఓటిటి సంస్థతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అందుకే ఆలస్యమవుతోందని ఇన్ సైడ్ టాక్. దీంతో ఖచ్చితంగా వాయిదా పడుతుందని ఫిక్స్ అయిపోయిన ఇతర ప్రొడ్యూసర్లు ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. మే 1 ఆల్రెడీ గాయపడ్డ సింహం ఉంది.
పెద్ది కొత్త డేట్ జూన్ 25 అని పలు వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే జూన్ 26 అఖిల్ లెనిన్ కోసం సితార ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ గా రెండు వారాల క్రితమే లాక్ చేసింది. అది కూడా పెద్ది కోసమే అన్నట్టుగా వివరణ ఇచ్చింది. మరి ఇప్పుడు పెద్ది కనక జూన్ చివరి వారంలో రావాలనుకుంటే లెనిన్ మళ్ళీ వెనుకడుగు వేస్తాడాని అక్కినేని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఏదైతేనేం దీనికి చెక్ పడింది. లెనిన్ జూన్ 26 కన్ఫర్మ్ చేస్తూ అఖిల్ కొత్త లుక్ తో పోస్టర్ వదిలారు.
దీంతో ఫ్యాన్స్ అనుమానాలు తీరిపోయాయి. అసలు జూన్ కు వెళ్లిపోవడమే వాళ్లకు ఇష్టం లేదు. అంతకన్నా ముందు రావాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ బాలన్స్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం కావడం లాంటి కారణాల వల్ల రెండు నెలలు ఎక్కువ టైం తీసుకున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ లవ్ పీరియాడిక్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
దశాబ్దం దాటినా సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ కు లెనిన్ విజయం సాధించడం చాలా అవసరం. అందుకే సితారతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ రంగంలోకి దిగి భాగస్వామ్యం తీసుకుంది. నాగార్జున అవసరమైనప్పుడు సూపర్ వైజ్ చేస్తున్నారని వినికిడి. జూన్ 26 విడుదల మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ పెద్ది కనక మనసు మార్చుకోకుండా అదే డేట్ కి వస్తానంటే పరిణామాలు మారొచ్చేమో కానీ ఇప్పటికైతే లెనిన్ ఆగమనంలో ఎలాంటి ఛేంజ్ ఉండదు.
This post was last modified on April 8, 2026 10:05 am
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…