Trends

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నారు.

బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిన వెంటనే డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు లోపల దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన ఆ స్థితిలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మొండికత్తిని తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తితో బస్సు కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టారు. మంటలు చుట్టుముడుతున్నా భయపడకుండా, తన దగ్గరలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఆ కిటికీ గుండా బయటకు తోసేశారు.

అందరినీ సురక్షితంగా బయటకు పంపిన తర్వాత, చివరగా అతను కూడా కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటికే బస్సు వెనుక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. “పొగ దట్టంగా ఉండటంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయాను” అని అతను ఆవేదనగా చెబుతుంటే, ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పోరాడారు. ఆ మొండికత్తే ఆ ఎనిమిది మందికి ప్రాణదాతగా మారింది. మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి బయటపడిన ఆ ప్రయాణికులు, తమకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కావడం కలచివేసే విషయం. అయితే ఈ వ్యక్తి సాహసం చేయకపోయి ఉంటే ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది.

This post was last modified on March 26, 2026 2:50 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

51 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago