Political News

చిన్నారెడ్డి మరో జీవన్ రెడ్డి అవుతారా?

గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను గద్దె దింపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎన్నో ఏళ్లుగా పార్టీని వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, ఆధిపత్య పోరు, అసంతృప్త నేతల బుజ్జగింపులను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది.

తెలంగాణలో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఎంతగా వ్యతిరేకించారో చెప్పనక్కర లేదు. చివరకు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా జీవన్ రెడ్డి వంటి నేతలు ఆయనపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీని వీడారు. తాజాగా అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పయనించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానని చిన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చారని, డబ్బులు లేకపోతే తనను ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారని అన్నారు. మేఘారెడ్డి దగ్గర రేవంత్ డబ్బులు తీసుకుని అతడికే టికెట్ ఇచ్చారని షాకింగ్ ఆరోపణలు చేశారు.

మేఘారెడ్డి అడ్డుపడడం వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రులు చెబుతున్నారని ఆరోపించారు. తన మనుషులకు కాంట్రాక్టులు రాకపోవడంతో పనులను మేఘారెడ్డి ఆపుతున్నట్లు మంత్రులు చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు. తన అనుచరులను కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే, తాను పార్టీ వదిలి వెళ్లనని, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానని చిన్నారెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. మరి, ఈ కామెంట్లపై మేఘారెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on August 17, 2026 2:52 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

46 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

1 hour ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago