Political News

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు.

ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు తమ భూములను స్వచ్ఛందంగానే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో తొలి రెండు, మూడేళ్లలోనే చంద్రబాబు అమరావతికి రాజధాని రూపు తెచ్చారు. తాజాగా అమరావతికి పటిష్ఠతకు ఆయన చర్యలను ప్రారంభించారు.

అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజధానిగా అమరావతిని సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. మూడు రాజధానులంటూ జగన్ చెప్పిన సిద్ధాంతాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాటం చేశారు.

2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగా చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా…రాజధానిగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా త్వరలోనే ఏపీ సర్కారు ఓ కీలక అడుగు వేయనుంది.

అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా బాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచనుంది. ఈ సమావేశంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది.

ఈ తీర్మానాన్ని నేరుగా కేంద్రానికి పంపనుంది. కేంద్రంలో కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లభిస్తే…. ఆ తర్వాత జగన్ అయినా, మరోవరైనా అధికారంలోకి వచ్చినా… అమరావతి నుంచి రాజదానిని మార్చడానికి వీలుండదు. 

వాస్తవానికి కేంద్రానికి పంపే తీర్మానం విషయంలో రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీతో పాటు శాసన మండలి ఆమోదం కూడా తీసుకుంటారు. అయితే ప్రతి తీర్మానం విషయంలో మండలి ఆమోదం తప్పనిసరి అన్న నిబంధన అయితే లేదు. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని కూటమి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.

అసెంబ్లీతో కూటమికి పూర్తి స్థాయి మద్దతు ఉన్నా… మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే… వైసీపీ అడ్డుకుని తీరుతుంది. దీంతో మండలి ఆమోదం అవసరం లేకుండానే ఈ తీర్మారాన్ని కేవలం అసెంబ్లీ ఆమోదంతో మాత్రమే కేంద్రానికి పంపాలని బాబు సర్కారు తీర్మానించింది. ఈ లెక్కన ఇకపై జగన్ సహా మరెవరు వచ్చినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు.

This post was last modified on March 26, 2026 2:47 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

1 hour ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago