ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి. లేదంటే దాని ప్రభావం నెగటివ్ గా ఉంటుందని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పట్లో గుర్తించేలా లేరు. తాజాగా ప్రేమ్ కీతను టీజర్ రిలీజయ్యింది. ఇది రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలుకి కొత్త రూపం. హాట్ స్టార్ లో హిందీ డబ్బింగ్ ఉంటే ప్రేమ్ కీతను కోసం తీయించారంటే పోలికలు వస్తాయని ఎంతగా టెన్షన్ పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
రీమేక్ చేస్తే చేశారు కానీ ఒరిజినల్ ని చెడగొట్టకూడదు. కానీ ప్రేమలులో ఉన్న సున్నితత్వం, యూత్ ఎలిమెంట్స్ ఇక్కడ పూర్తిగా మిస్ అయ్యి ఏదేదో చేసిన ఫీలింగ్ కలుగుతోంది. పైగా రాజ్ కుమార్ రావు తమ్ముడు ఆపర్ శక్తి ఖురానాతో సహా లీడ్ పెయిర్ కలిపి తెలిసిన మొహాలు ఏవీ పెద్దగా లేకపోవడం ఇంకో మైనస్. అక్టోబర్ రిలీజ్ కు ఇది రెడీ అవుతోంది. సరే దీని సంగతలా ఉంచితే ఇలా రీమేకుల పేరు చెప్పి ఒరిజినల్ వెర్షన్లను చెడగొట్టడం బాలీవుడ్ లో కొత్త కాదు.
తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయిన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే హిందీలో దారుణంగా పోయింది. అమీర్ ఖాన్ కొడుకు, శ్రీదేవి చిన్న కూతురు కలిసి నటించినా లాభం లేకపోయింది. అల వైకుంఠపురములో లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ని రెండో వారానికే థియేటర్ల నుంచి తీసేసేలా షెహ్ జాదాని ఇచ్చిన ఘనత కూడా వాళ్ళకే దక్కింది. ఇవే కాదు హిట్ ది ఫస్ట్ కేస్, జెర్సీ, గద్దలకొండ గణేష్ లాంటి ఎన్నో రీమేకులు అడ్రెస్ లేకుండా పోయాయి.
నాని ఎంసిఏ హిందీ రీమేక్ ఘోరంగా పోయిందనే సంగతి చాలా మందికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది. అయినా ఒక యూత్ రామ్ కామ్ తీయడానికి రెండేళ్లు ఎందుకు తీసుకున్నారో వాళ్లకే తెలియాలి. ప్రస్తుతం ఈ ప్రేమ్ కీతన్ ని మన సౌత్ ఫ్యాన్స్ బాగానే ట్రోల్ చేస్తున్నారు. హీరో వీర్ పహారియా మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినా ఇదంతా చెప్పినా, తెలుసుకున్నా నార్త్ ఫిలిం మేకర్స్ వీటిని ఇప్పట్లో మానుకునేలా లేరు.
This post was last modified on August 17, 2026 4:31 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…