డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక (భూంపల్లి) ప్రాంతంలో తల్లీకొడుకు కలిసి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.1 తులాల బంగారం, 53 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
భూంపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపంలో హోటల్, దుకాణం నిర్వహిస్తున్న చాకలి రజిత (38) క్రైమ్ కథనాలు, ఆన్‌లైన్ వీడియోలు చూస్తూ హత్యలకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన మైనర్ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసినట్లు దర్యాప్తులో తేలింది. కుమారుడు శారీరకంగా బలంగా ఉండేందుకు ఇంట్లోనే వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.
ఒంటరి మహిళను నమ్మించి..
గతంలో ‘రేఖ’ అనే ఒంటరి మహిళను నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి అచ్చమాయపల్లి అటవీ ప్రాంతంలో తగలబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఇటీవల అతికం విజయ (45)ను తమ ఇంటికి పిలిపించిన తల్లీకొడుకు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై రామక్కపేట శివార్లకు తరలించి కాల్చివేసినట్లు దర్యాప్తులో తేలింది. సగం కాలిన స్థితిలో మృతదేహం లభించడంతో పోలీసులు కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో ఛేదింపు
విజయ మృతదేహం లభించిన తర్వాత సిద్దిపేట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులపై దృష్టి సారించినట్లు సమాచారం. అనంతరం రజితతో పాటు ఆమె మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. రజితను రిమాండ్‌కు తరలించగా, బాలుడిని జువైనల్ హోమ్‌కు పంపినట్లు తెలిసింది.
విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మంచానికే పరిమితమైన భర్తకు బీమా చేయించి అనంతరం అతడిని హత్య చేయడంతో పాటు మరో ముగ్గురు మహిళలను కూడా హత్య చేసేందుకు తల్లీకొడుకు పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటనలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on August 17, 2026 3:08 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…