Political News

అప్పుడు ‘తెలంగాణ’ బిడ్డలు… ఇప్పుడు ‘తెలుగు’ బిడ్డలు

మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సపరివారసమేతంగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా మన ఆంధ్రాలో కూడా మన తెలుగు బిడ్డలు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్న తపనతో ఇక్కడ యూనివర్సిటీ పెట్టామని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

గతంలో మన తెలంగాణ బిడ్డలు అని సంబోధించే మల్లారెడ్డి ఈ రోజుల మన ఆంధ్రా..మన తెలుగు బిడ్డలు అని సంబోధించడం మంచి పరిణామం. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన మల్లారెడ్డి ఆంధ్రాలో తన విద్యాసంస్థలను విస్తరించాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక, తన యూనివర్సిటీకి మంచి స్థలం దొరికిందని, మంచి అడ్మిషన్లు అయ్యాయని మల్లారెడ్డి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

గత ఏడాది తన పుట్టిన రోజు నాడు తిరుపతి వచ్చి మొక్కానని, ఈ ఏడాదికి యూనివర్సిటీ పూర్తయిందని చెప్పారు. వర్సిటీ కోసం స్థలంతో పాటు అనుమతులు కూడా త్వరగా దొరికాయని చెప్పారు. అడ్మిషన్లు కూడా బాగా జరిగాయని, అందుకే కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుందామని వచ్చానని అన్నారు. తెలంగాణలో 50 వేల మంది స్టూడెండ్స్, 10 వేల మంది టీచర్లు ఉన్నారని తెలిపారు. ఏపీలో మొదటి యూనివర్సిటీ పెట్టానని, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చేయాలన్న సంకల్పంతోనే ఈ వర్సిటీ ఏర్పాటు చేశానని చెప్పారు.

This post was last modified on August 17, 2026 4:19 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

31 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago