Movie News

కొరటాలకే ఎందుకిలా జరుగుతోంది

దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి కానీ దాని విషయంలో జరిగిన ప్రచారం మాములు డ్యామేజ్ చేయలేదు. సరే జరిగిందేదో జరిగిందనుకుని జూనియర్ ఎన్టీఆర్ దేవర ఛాన్స్ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వసూళ్ల లెక్కలు పక్కన పెడితే తారక్ కు పెద్ద విజయం ఖాతాలో వేసింది. కానీ సెకండాఫ్, ఓవరాల్ కంటెంట్ గురించి యునానిమస్ ప్రశంసలు రాలేదన్నది వాస్తవం.

దాని తర్వాత అదిగో ఇదిగో అంటూ దేవర 2 ముందుకు వెళ్లకుండా చేశారు. ఈలోగా వార్ 2 రిలీజ్ అయిపోయింది. డ్రాగన్ రెండు భాగాలతో వచ్చే ఏడాది రెడీ అవుతోంది. కానీ కొరటాలకు సీక్వెల్ కు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. జూనియర్ బర్త్ డేకి దేవర 2 పోస్టర్ ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సరే అయితే అయ్యింది లెమ్మని కొరటాల మెల్లగా బాలకృష్ణను చేరి కథ చెప్పి ఒప్పించుకున్నారు. ఆ మధ్య గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టు అంత తొందరగా ముందుకు వెళ్లకపోవచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, బాలయ్య పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇన్ సైడ్ టాక్. మరింత బెటర్ గా వచ్చేంత వరకు కొరటాల శివ మళ్ళీ పని కొనసాగిస్తారా లేక మొత్తానికే ఆగిపోతుందా అనే డిస్కషన్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. గతంలో అల్లు అర్జున్ సినిమా ప్రకటన స్టేజి దాటిపోయాక ఆగిపోయిన సంగతి అభిమానులకు గుర్తే.

మరి బాలయ్య 112 ఏమవుతుందో ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. గోపిచండ్ మలినేని షూటింగ్ లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య కొన్ని కథలు వింటున్నారట. అనిల్ రావిపూడి కూడా లైన్ లో ఉన్నప్పటికీ స్టోరీ పక్కాగా కుదిరి, భగవంత్ కేసరిని మించేలా ఉంటేనే సెట్స్ మీద వెళ్తారట. ఆదిత్య 999 మ్యాక్స్ తో పాటు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఇస్తారేమోనని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి. 

This post was last modified on August 17, 2026 4:27 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

5 hours ago