మీడియా, సోషల్ మీడియాను ఊపేస్తున్న బలూచీ సోదరి హత్య

పాకిస్ధాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో నివసించే కరిమ బలూచి హత్య యావత్ ప్రపంచంలోని సోషల్ మీడియాతో పాటు మీడియాను కూడా ఓ ఊపు ఊపేస్తోంది. ఆమధ్య బలూచిస్ధాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ కరీమా ప్రధానమంత్రి నరేంద్రమోడికి బహిరంగంగా విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బలూచిస్ధాన్ లోని పరిస్ధితులు ప్రధానంగా మహిళల పరిస్ధితి చాలా ఘోరంగా ఉందని చెబుతూ వెంటనే మోడిని జోక్యం చేసుకోవాలని కరీమా కోరింది. అప్పట్లో ఆ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఎందుకంటే పాకిస్ధాన్ లో బలూచిస్ధాన్ వ్యవహారాల్లో భారత్ ప్రధానిని జోక్యం చేసుకోవాలని కోరటమంటూ మామూలు విషయం కాదు. బలూచిస్ధాన్ లో ప్రతిరోజు మహిళలను అపహరించటం, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నట్లు ఆమె మొత్తకున్నారు. మహిళలకే కాదు చివరకు మగవాళ్ళకూ కూడా భద్రత లేదని ఆమె ఎంతగానో గోల చేశారు. దాంతో అంతర్జాతీయ మీడియా దృష్టంతా బలూచిస్ధాన్ పై పడింది.

ఎప్పుడైతే అంతర్జాతీయ మీడియా దృష్టితో పాటు విదేశీ ప్రభుత్వాల దృష్టి బలూచిస్ధాన్ పై పడిందని గ్రహించిందో వెంటనే పాకిస్ధాన్ ప్రభుత్వం అలర్టయ్యింది. దాంతో మానవహక్కుల కార్యకర్తలు కూడా ఇంకా యాక్టివ్ అయ్యారు. ఇటువంటి సమయంలో కరీమాపై దాడులు మొదలయ్యాయి. దాంతో బలూచిస్ధాన్ నుండి ఎలాగో తప్పించుకున్న కరీమా కెనాడకు పారిపోయింది. అక్కడి నుండే బలూచిస్ధాన్ లోని పరిస్ధితులపై పోరాటాలు ప్రారంభించింది.

సరే కరీమా ఎంతగా మొత్తుకున్నా నరేంద్రమోడి మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పాకిస్ధాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే వచ్చే తలనొప్పులేంటో బాగా తెలుసు. అందుకనే మోడి కూడా పట్టించుకోలేదు. అయితే కరీమా ఉద్దేశ్యం కూడా నేరుగా బలూచిస్ధాన్ అంతర్గత విషయాల్లో మోడి జోక్యం చేసుకోవాలని కాదు. అంతర్జాతీయ వేదికలపై బలూచిస్ధాన్ లో జరిగే పరిణామాలను మోడి ప్రస్తావిస్తారని అనుకున్నారు. ఇదే విషయాన్ని మోడికి విజ్ఞప్తి కూడా చేశారు.

అయితే ఏ విధంగా కూడా ప్రధానమంత్రి స్పందించలేదు. అయితే కెనాడుకు చేరుకున్న కరీమా మీద అక్కడ కూడా దాడులు మొదలయ్యాయి. ఎందుకంటే కరీమా కన్నా ముందే కెనాడాలో చాలామంది పాకిస్ధాన్ రిటైర్డ్ ఆర్మీ అధికారులున్నారు. వారికి పాకిస్ధాన్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఉద్యమకారిణిపై కెనాడాలో కూడా దాడులు మొదలైనట్లు ఆరోపణలున్నాయి. అంటే పాకిస్ధాన్ ఆర్మీలో రిటైర్డ్ అధికారులు, ఖలిస్ధాన్ తదితర సంస్ధల్లోని కీలక సభ్యుల ఆదేశాల ప్రకారమే కరీమాను చంపేసినట్లు ఆరోపణలున్నాయి. టోరంటోలోని లేక్ షోర్ సమీపంలో చనిపోయున్న కరీమాను గమనించి పోలీసులకు ఎవరో సమాచారమిచ్చారు. దాంతో విషయం బయటకువచ్చింది.