Trends

తేల్చేశారు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం

దశాబ్దాల కాలంగా మధ్య ప్రాచ్య దేశాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిసింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసం, కార్యాలయంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. మొదట అబద్ధమని వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారిక వార్తలతో నిజం బయటపడింది. 1989 నుంచి ఇరాన్‌ను శాసిస్తున్న ఒక శక్తివంతమైన నాయకుడి పతనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా ఖమేనీ కదలికలను నిరంతరం గమనిస్తూ, అత్యంత కచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం ఖమేనీ మాత్రమే కాకుండా, ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్ పూర్ సహా మరికొందరు కీలక నేతలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఆపరేషన్ తర్వాత ఇరాన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఖమేనీకి వారసుడు ఎవరనేది ఇప్పటి వరకు ఖరారు కాకపోవడంతో, ఆ దేశ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఖమేనీ మరణం ఇరాన్ ప్రభుత్వ పునాదులను కదిలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తూ, ఇజ్రాయెల్, అమెరికా స్థావరాల లక్ష్యంగా క్షిపణి దాడులు ప్రారంభించడం యుద్ధ మేఘాలను మరింత దట్టం చేసింది.

అయతొల్లా అలీ ఖమేనీ ఇరాన్ చరిత్రలో అత్యంత పవర్ఫుల్ నాయకుడిగా పేరుగాంచారు. మొదట్లో బలహీనమైన వ్యక్తిగా భావించినప్పటికీ, క్రమంగా దేశంలోని సైనిక, న్యాయ, ప్రభుత్వ విభాగాలపై పూర్తి పట్టు సాధించారు. పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన హార్డ్ లైన్ విధానాలతో దేశాన్ని నడిపించారు. ఆయన సుదీర్ఘ పాలనలో ఇరాన్ అనేక ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ, తన పంథాను మాత్రం మార్చుకోలేదు.

ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ దాడుల తర్వాత మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొంటుందా లేక మరో యుద్ధానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇరాన్ ప్రజలు ఈ మార్పును ఎలా స్వీకరిస్తారో, అక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఏది ఏమైనా, ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా నిలిచిపోతుంది.

This post was last modified on March 1, 2026 10:16 am

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

23 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

42 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

49 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago