టాక్సిక్ నుంచి కొత్త పాట వచ్చింది. ఈసారి యష్ తో తారా సుతారియా రొమాన్స్ చేసింది. తబాహి లాగే ఇందులో కూడా కౌగిలింతలు, చుంబనాలు, యువతను టార్గెట్ చేసుకున్న కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి. ట్యూన్ కూడా కొంచెం దానికి దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు సాంగ్స్ ఒకే అంశాన్ని హైలైట్ చేయడం చూస్తుంటే యాక్షన్ కన్నా ఎక్కువగా బోల్డ్ కంటెంట్ మీద ఆధారపడ్డారేమోననే అనుమానం కలిగితే అది ఎవరి తప్పు కాదు. కంటెంట్ అలా ఉంది.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని తలకెత్తుకున్నప్పుడు ఆవిడ సరిగా నిర్వర్తించగలరా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. టీజర్ కొంత వాటిని తీర్చింది. ట్రైలర్ వచ్చాక పూర్తి క్లారిటీ వస్తుంది. తండ్రి కొడుకులుగా యష్ డ్యూయల్ రోల్ చేసినట్టుగా ఆల్రెడీ క్లూస్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందనే దాని మీద ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గ విజువల్స్ ఇంకా బయటికి రాలేదు.
ప్రమోషన్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం జరగాలి. కానీ టాక్సిక్ టీమ్ తీరు చూస్తుంటే హీరో పాత్రలోని రసికతను హైలైట్ చేయడం కోసమే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎంత వరకు మేలు చేస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే టాక్సిక్ పూర్తిగా యష్ పేరు మీద బిజినెస్ చేసుకుంటున్న సినిమా. గీతూ మోహన్ దాస్ కి ఎలాంటి మార్కెట్, ఇమేజ్ లేదు. కాంబో కుదిరినప్పుడు జనంలో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించనిది ఇందుకే. సో ఆమెకిది పెద్ద సవాలే.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఎస్విసి తరఫున దిల్ రాజు దీన్ని ఏపీ తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నారు. జన నాయకుడు కూడా ఆ డీల్ లో భాగంగానే తీసుకున్నారట. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లు నటిస్తున్న టాక్సిక్ లో హ్యూమా ఖురేషి మరో ప్రధాన పాత్ర పోషించారు. ట్రైలర్ వచ్చాక లెక్కలన్నీ మారిపోతాయని టీమ్ ధీమాగా ఉంది. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on July 21, 2026 4:56 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…