Movie News

మన బిగ్ బాస్.. వాళ్ల బిగ్ బాస్… ఎంత తేడా?

తెలుగులో అత్యంత ఆదరణ దక్కించుకున్న టీవీ షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. దీని ద్వారా ఎంతోమంది సాధారణ ప్రజలు సెలబ్రెటీలుగా మారారు. కాస్త పేరున్న టీవీ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఇంకా పాపులారిటీ సంపాదించారు. కాకపోతే బిగ్ బాస్‌తో వచ్చిన ఫేమ్‌ను సినిమాల కోసం సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ షో కొంత ఉపయోగపడింది తప్ప.. ఇంకెవ్వరికీ కెరీర్ పరంగా దీని వల్ల పెద్దగా పుష్ లభించలేదు.

‘బిగ్ బాస్’ విన్నర్ అయ్యాక కౌశల్ హడావుడిగా కొన్ని సినిమాలు అనౌన్స్ చేశాడు కానీ.. అవి తర్వాత అడ్రస్ లేకుండా పోయాయి. షో ఫాలోయింగ్ చూసి ఎంతో ఊహించుకుని సినిమాలు చేసిన సోహెల్ పరిస్థితి ఏంటో తెలిసిందే. దివి సహా ఎంతోమంది అమ్మాయిలు కూడా బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో వెలిగిపోవాలని ప్రయత్నించారు కానీ.. అనుకున్నంత పేరు సంపాదించలేకపోయారు.

కానీ తమిళంలో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ ఈ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించి, ఆ తర్వాత సినిమాల్లో బ్రేక్ అందుకున్న వాళ్ల సంఖ్య పెద్దదే. ‘కిష్కింధపురి’లో విలన్ పాత్ర చేసిన శాండీ మాస్టర్‌తో పాటు ఒవియా, లాస్లియా, రాజు జయమోహన్, ఆరవ్, దర్శన్ లాంటి వాళ్లకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. ఐతే వీళ్లందరూ ఒకెత్తయితే.. కెవిన్ మరో ఎత్తు. అతను ‘బిగ్ బాస్’ ఫేమ్‌తో సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుని స్టార్ అయిపోయాడు.

‘డడా’ సూపర్ హిట్ కావడంతో తన రాత మారిపోయింది. స్టార్, బ్లడీ బెగ్గర్, కిస్, మాస్క్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు.
ఇప్పుడు తన కెరీర్లోనే అతి పెద్ద సినిమాతో వస్తున్నాడు కవిన్. అతను లేడీ సూపర్ స్టార్ నయనతార‌కు జోడీగా నటించడం విశేషం. వీరి కలయికలో తెరకెక్కిన ‘హాయ్’ మూవీ ఆగస్గు 14న విడుదల కానుంది. కవిన్ కంటే నయన్ వయసులో పెద్ద. ఐతే అందుకు తగ్గట్లే వయసు అంతరం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య నడిచే కథ ఇది. అనామకుడిగా ‘బిగ్ బాస్’ షోలో అడుగు పెట్టిన కవిన్.. అక్కడ వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుంటూ నయన్‌కు జోడీగా నటించే స్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమే.

This post was last modified on July 21, 2026 2:54 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

2 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

4 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

5 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

8 hours ago