Movie News

వీరాధివీరులు పండక్కు రావడం డౌటే

వీరాధివీరులు టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా రవితేజ – శ్రీవిష్ణు మల్టీస్టారర్ కు ఆ పేరు దాదాపు కన్ఫర్మే. రిజిస్టర్ చేశారట కానీ ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు కాబట్టి సరైన సందర్భం చూసి అనౌన్స్ మెంట్ ఇవ్వాలని టీమ్ నిర్ణయించుకుందట. రాజరాజ చోర, స్వాగ్ లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన హసిత్ గోలి దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో, హీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ సిద్దమయ్యిందని సమాచారం.

అయితే ఈ సినిమాని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ డౌటేనంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఎందుకంటే జూలై మినహాయిస్తే చేతిలో ఉన్నది కేవలం అయిదు నెలలు. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, ప్రమోషన్స్ ఇవన్నీ దీంట్లోనే కవరైపోవాలి. అసాధ్యం కాదు కానీ ఇద్దరు హీరోలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు హడావిడి చేయకూడదు. చిన్న పొరపాటు ఒక్కోసారి పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం రవితేజ కొంచెం లేట్ అయినా పర్లేదు బెస్ట్ ఇద్దామని హసిత్ గోలితో చెప్పారట. హిట్ స్టాంప్ పడాల్సిన భర్త మహాశయులకు విజ్ఞప్తి పండగకు వచ్చి మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారితో క్లాష్ అవ్వడం వల్లే అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదని, అందుకే సంక్రాంతికి మోజు పెంచుకోవడం కన్నా కొంచెం నెమ్మది అయినా సరే సోలోగా రావడమే ఉత్తమమని భావించారట. శ్రీవిష్ణు కూడా దీనికే సపోర్టని టాక్.

సో ఇప్పటికైతే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనట్టే. ఇక రవితేజ విషయానికి వస్తే ఇరుముడి చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ సమాంతరంగా చేస్తున్నారు. ఆగస్ట్ 21 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. ఆపై వారం టాక్సిక్ ఉన్నా కూడా టీమ్ ఎలాంటి టెన్షన్ పడటం లేదట. కంటెంట్ సాలిడ్ గా ఉండటం, అయ్యప్ప ఎలిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ వగైరాలు కుటుంబ ప్రేక్షకులను తమ సినిమాకే వచ్చేలా చేస్తాయని వాళ్ళ ధీమా. 

This post was last modified on July 21, 2026 4:07 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

12 minutes ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

2 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

6 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

6 hours ago