Movie News

బాలా బాబాయ్ మళ్ళీ గర్జించాలి…

నందమూరి అభిమానుల్లో బాలయ్యకు ప్రత్యేకంగా, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉండొచ్చు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ ఆ రెండు వర్గాలను మించి… ఈ ఇద్దరినీ ఉమ్మడిగా ఇష్టపడే అభిమానుల సంఖ్యే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. బాబాయ్, అబ్బాయ్ కలిసి కనిపించినా.. ఒకరి కోసం ఒకరు నిలబడినా.. ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడినా.. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు.

ముఖ్యంగా బాలయ్య మీద తారక్ చూపించే ప్రేమ, గౌరవం ప్రత్యేకమైనవి. బాబాయ్ కోసం ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటాడు తారక్. ఇప్పుడు ఇలాంటి సందర్భమే వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో ఒక ప్రమాదం జరిగి నందమూరి సీనియర్ హీరో గాయపడ్డారు. వెంటనే బాలయ్యను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

గాయం చిన్నదే అని, పెద్ద ప్రమాదం లేదని అంటున్నారు.
బాలయ్య గాయపడి ఆసుపత్రిలో చేరారు అని తెలియగానే నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాలయ్యను బాల బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని.. తన ఆరోగ్యం బాగుండాలని.. ఎప్పటిలాగే ఆయన గర్జించాలని ఆకాంక్షించాడు తారక్. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టాడు.

ఒకప్పుడు బాలయ్య, తారక్ ఎంతో సన్నిహితంగానే ఉండేవారు కానీ.. మధ్యలో ఎందుకో గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ బాలయ్యను గౌరవిస్తూనే ఉంటాడు. ఇటీవల తారక్ రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వచ్చినపుడు కొందరు ఫ్యాన్స్ అతన్ని తక్కువ చేసి మాట్లాడ్డం, కించపరిచేలా పోస్టులు పెట్టడం చేశారు. అలాంటి వాళ్లకు తారక్ పోస్టు చెంప పెట్టు లాంటిదే.

This post was last modified on July 21, 2026 4:52 pm

Share

Recent Posts

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

17 minutes ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

38 minutes ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

1 hour ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

1 hour ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

2 hours ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

6 hours ago