Movie News

ట్రాక్ తప్పుతున్న టాలెంటెడ్ హీరో

ట్రాక్ సరిగ్గా ఉండాలంటే ఇండస్ట్రీలో సక్సెస్ చాలా అవసరం. అది ఉంటే నెత్తిన బెట్టుకుంటారు. లేనినాడు క్రమంగా ఒక్కొక్కరు దూరమై అవకాశాలకు మొహం చాటేస్తారు. ఇక్కడ కావాల్సింది ఒక పెద్ద హిట్టు. అది దక్కితే చాలు ఈజీగా నాలుగైదు సంవత్సరాలు నిశ్చింతగా ఉండొచ్చు. తిరువీర్ ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నాడు. వెరైటీ కథలు చేస్తున్నాడు కానీ ఫలితాలు దారుణంగా వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ సుకుమారి సైతం ఫ్లాపుల దారిలోనే ప్రయాణించి నిరాశ కలిగించింది.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తిరువీర్ మాట్లాడుతూ రోజు చాలా కథలు వింటానని, ఇప్పటిదాకా మూడు వందలకు పైగా రిజెక్ట్ చేశానని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. సరే బాగానే ఉంది. మరి ఇంత ఫిల్టర్ చేసి ఒప్పుకున్నవి కనీసం యావరేజ్ అయినా కావాలి కదా. అదీ జరగలేదు. పాపం ప్రతాప్ కి మాములు హడావిడి చేయలేదు. క్లాసిక్ హిట్ ఇస్తున్నాం అన్న రేంజ్ లో నిర్మాతలు తెగ ఊదరగొట్టారు. తీరా చూస్తే థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు.

తిరువీర్ త్వరగా రియాలిటీకి లోకి వచ్చేయాలి. హీరో లేదా హీరోయిన్ పాత్రలకు ఏదో ఒక ట్విస్ట్ లేదా లోపం ఉన్న కథలను వీలైనంత పక్కన పెట్టేయాలి. సహజత్వానికి దూరంగా ఉండే ఇలాంటి సబ్జెక్టులు సామాన్య జనాలకు కనెక్ట్ కావు. అందులోనూ కామెడీ మీద ఎక్కువ ఆధారపడినప్పుడు అనిల్ రావిపూడి తరహాలో హిలేరియస్ అనిపించే కంటెంట్ రాసుకోవాలి. అంతే తప్ప సోషల్ మీడియా, జబర్దస్త్, యూట్యూబ్ జోకుల స్థాయిలో ఆలోచించకూడదు.

నెక్స్ట్ తిరువీర్ నుంచి భగవంతుడు రాబోతోంది. ఇది సీరియస్ డ్రామా. డివోషన్, రివెంజ్ మిక్స్ చేసి కొంచెం సీరియస్ గా తీసినట్టు టీజర్ చూస్తే అర్థమైపోతోంది. కాకపోతే ఇందులో కూడా యునీక్ పాయింట్ ఉండాలి. లేదంటే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తీసిన మరో మాములు సినిమాగా గుంపులో కలిసిపోతుంది. ఎంటర్ టైన్మెంట్ కన్నా ఎమోషన్ మీద భగవంతుడు నడుస్తుందని, కాబట్టి ఖచ్చితంగా మెప్పిస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అది నిజమైతేనే తిరువీర్ కెరీర్ మెరుగుపడుతుంది. భగవంతుడు తర్వాత తిరువీర్ మరో హీరో విశ్వదేవ్ తో కలిసి ఎస్కెఎన్ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించే ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

This post was last modified on July 21, 2026 4:35 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

43 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago