పెళ్లి చేసుకున్నాక అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఉదంతాలను ఇటీవల బోలెడు చూశాం. అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన అమ్మాయి కథా ఇటీవల చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఇంకో దారుణ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి.. భర్తకు మగతనం లేదని అవమానించడంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది.
మూడు నెలల కిందటే పెళ్లి చేసుకున్న సదర్ లాల్ అనే 27 ఏళ్ల యువకుడు భార్య అవమానాలకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లయిన మూడో రోజు నుంచే నీకు మగతనం లేదంటూ సదర్ లాల్‌ను భార్య అవమానించేదదట. ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తారింటికి భార్యతో కలిసి సదర్ వెళ్లగా.. అక్కడ గొడవ జరిగిందట. కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి భార్య అవమానించిందట. నీకు మగతనం లేదని అందరి ముందు అనడంతో అతను తట్టుకోలేకపోయాడు.
తీవ్ర మనస్తాపంతో తన అక్క దగ్గరికి వెళ్తున్నట్లు బావకు మెసేజ్ పెట్టిన సదర్.. అక్కడ కలుపుమందు తాగి ప్రాణం తీసుకున్నాడు. వెంకటనాయపాలెం కాలువ దగ్గర అతడి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. పెళ్లికి ముందే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని.. ఇష్టం లేని పెళ్లి చేయడంతో భర్త మీద నింద మోపి విడిపోయేందుకే ఇలా చేసిందని.. సదర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సదర్‌కు మగతనం లేదని పంచాయితీ పెడితే.. అతడికి మెడికల్ టెస్టులు కూడా చేయించామని, అలాంటిదేమీ లేదని.. భార్య తనపై అభాండాలు వేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని వారంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on July 21, 2026 8:30 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…