Trends

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు మొబైల్ వాడొద్దని మందలించడంతో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఫ్లాట్ నంబర్ 907 బాల్కనీ నుంచి వీరు ముగ్గురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకు దూకడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

​మృతులను పాఖి (12), ప్రాచి (14), విశిక (16)గా పోలీసులు గుర్తించారు. తిండి, చదువు.. ఇలా ప్రతి విషయంలోనూ కలిసుండే ఈ ముగ్గురు సోదరీమణులు, కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఫోన్‌లకు అలవాటు పడ్డారు. మెల్లగా అది గేమింగ్ అడిక్షన్ గా మారింది. ముఖ్యంగా ఒక కొరియన్ ఆన్‌లైన్ టాస్క్ బేస్డ్ లవ్ గేమ్‌కు వీరు తీవ్రంగా బానిసలయ్యారని, దానివల్ల స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశారని విచారణలో తెలిసింది.

​పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు, వారి గేమింగ్ పిచ్చిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ చిన్నారులు, క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ ఆ ముగ్గురు విడదీయలేని బంధంతో మృత్యుఒడిలోకి చేరారు. తీలా మోర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

​నేటి తరం పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆన్‌లైన్ ఆటల కోసం కన్నవారిని, కన్న కలలను వదిలేసి తనువు చాలించడం సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ అలవాట్లపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో చిన్న పిల్లలలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువవుతున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. పేరెంట్స్ నిందించినా టీచర్ పనిష్మెంట్ ఇచ్చినా తట్టుకోలేనంత బలహీనంగా మారుతున్నారు. 

This post was last modified on February 4, 2026 2:57 pm

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

43 minutes ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

1 hour ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

2 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

3 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

5 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

5 hours ago