లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు… ఈ వ్యవహారంపై ఒకింత లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అందులో భాగంగా రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. పోలీసు డ్యూటీలో నిమగ్నం కావడానికి శిక్షణ తీసుకుంటున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడి అడ్డంగా బుక్కైన రెడ్డి… వరుసగా వెలుగులోకి వస్తున్న విషయాలను చూస్తుంటే… నిజంగానే ఓ పర్వర్టెడ్ వ్యక్తిగా కనిపిస్తున్నారని చెప్పాలి.
శాంతి భద్రతలు కాపాడాల్సిన గురుతర
బాధ్యతల్లోకి ఒదిగిపోయేందుకు రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సమాజాన్ని దారిలో పెట్టే బాద్యతల శిక్షణలో ఉండగానే.. సాటి ట్రైనీ ఐపీఎస్ పై వేధింపులకు పాల్పడ్డ రెడ్డి… తన బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. అయితే తాజాగా రెడ్డికి మహిళలతో సంబంధాల విషయంలో పెద్ద చరిత్రే ఉందని బయటపడింది. అంతేకాకుండా…గతించిపోయిన ప్రేమలేఖలను ఈయన గారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారట. ఓ వివాహితతో సంబంధం కూడా పెట్టుకునే దిశగా సాగారట. ఆమెతో బంధం నెరపుతూనే లేడీ ట్రైనీ ఐపీఎస్ ను ముగ్గులోకి దించేందుకు యత్నించారట. వెరసి రెడ్డి మనస్తత్వం నిజంగానే పర్వర్టెడ్ మనస్తత్వంతో కూడుకున్నదేనని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా లేడీ ట్రైనీ ఐపీఎస్ చెప్పిన ఓ విషయాన్ని పరిశీలించిన పోలీసులు రెడ్డిగారి గతాన్ని కూడా తవ్వుతున్నారు. ఈ తవ్వకాల్లో భాగంగా ఏపీకి చెందిన ఓ వివాహితను ఈయన ఏకంగా ఆమె సొంతూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చేశారట. నగరంలోని అశోక్ నగర్ లో ఆమెను ఉంచగా… ఆమె కొంతకాలం పాటు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కూడా చేశారట. ఆ తర్వాత ఈ జనవరిలో అశోక్ నగర్ లోని ఓ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ లోనే ఆమెకు ఉద్యోగం ఇఫ్పించారట. అప్పటికే పెళ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్న సదరు మహిళతో సహజీవనం చేసేందుకూ యత్నించారట. అయితే తన భర్తతో ఇంకా విడాకులు రాకపోవడంతో ఆమె అందుకు ఒప్పుకోలేదట.
లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతోనే ఉదయ కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బాధితురాలిని ఆమె గదిలోకే దూరి… ఆమెపై దౌర్జన్యం చేశారని కూడా తాజాగా తేలింది. ఈ సందర్భంగా ఆమె ఫోన్ ను నేలకేసి పగలగొట్టారట. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన పోలీసులు ఈ విషయం నిజమేనని తేల్చారట. అంతేకాకుండా అతడి గదిలో రెండు ప్రేమ లేఖలను కూడా పోలీసులు గుర్తించారట. అందులో ఇద్దరు వ్యక్తుల చేతిరాతలు ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి… గతించిపోయిన ప్రేమలేఖలను ఇంకా కొనసాగిస్తున్న రెడ్డి… పర్వర్టెడ్ కాక మరేమిటన్న వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే… ఓ సినిమా స్టోరీని తలపించేలా తాను హైదరాబాద్ తీసుకువచ్చిన సదరు వివాహిత వద్దకు లేడీట్రైనీ ఐపీఓస్ ను కూడా రెడ్డిగారు తీసుకెళ్లారట. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మహిళల మధ్య మాటలు కలవగా… రెడ్డిగారి మనస్తత్వంపైనే వారు చర్చించుకున్నారట. తన గదిలోకి వచ్చి తనపై దౌర్జన్యం చేశారని, మితిమీరిన కోపంతో తన ఫోన్ ను పగులగొట్టారని ట్రైనీ ఐపీఎస్ ఆ మహిళకు చెప్పారట. దీంతో రెడ్డిగారి పర్వర్టెడ్ మనస్తత్వం గురించి తెలుసుకున్న సదరు వివాహిత… అతడిని దూరం పెట్టేసిందట. మొత్తంగా ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సినిమాల్లో పర్వర్టెడ్ కేరక్టర్ ల తాలూకు అనుభవాలను బయటపెడుతోంది.
This post was last modified on August 3, 2026 10:41 am
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…