Movie News

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్ వల్ల కాకపోతే వేరుగా రచయితలను తీసుకొచ్చి పని పూర్తి చేయడం అప్పట్లో మాములు విషయం. తర్వాత ట్రెండ్ మారిపోయి హీరోలే నవ్వించడం మొదలుపెట్టాక క్రమంగా వీళ్ళ ప్రాధాన్యం తగ్గింది. ఒకప్పుడు హాస్య నటుల కోసమే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ఉండటం సహజం. ఆలీబాబా అరడజను దొంగలు లాంటివి బెస్ట్ ఎగ్జాంపుల్.

కొత్త జనరేషన్ లో ప్రత్యేకంగా ఒక ఇమేజ్ సృష్టించుకున్న కమెడియన్స్ అరుదైపోయారు. సునీల్ సోలో హీరోగా మారిపోయాక కొంత గ్యాప్ రావడం తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం విలన్ గా మారిపోవడం తెలిసిందే. ఈ గ్యాప్ వాడుకునే పనిలో సత్య బిజీగా మారిపోయాడు. సరిగా చూపించే దర్శకులు తగలాలే కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో తన స్టైల్ వేరు. మత్తువదలరా, నారి నారి నడుమ మురారి లాంటి సినిమాల విజయంలో సత్య పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ వారం కొరియన్ కనకరాజు విడుదలవుతోంది. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. వరుణ్ తేజ్ నాన్ స్టాప్ గా ఏది అడిగితే అది కాదనకుండా పాల్గొంటూనే ఉన్నాడు. ముఖ్యంగా సత్య యాక్టివ్ నెస్ అంచనాల పరంగా బాగా ప్లస్ అవుతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ కొరియన్ వాళ్ళతో ఫైట్లు చేసే ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉంది. ఇవే కాదు ఇంటర్వ్యూలలో సత్య చూపిస్తున్న చలాకీతనం ఓ రేంజ్ లో ఉంది.

ఇదేదో తనను పొగిడేందుకు కాదు కానీ మూడు నెలలుగా బాక్సాఫీస్ వద్ద ఫుల్ కామెడీ మూవీ ఏదీ రాలేదు. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ ఎంత హిట్టయినా వాటిలో హాస్యం మోతాదు చాలా తక్కువ. కొరియన్ కనకరాజు పూర్తిగా కామెడీ మీదే ఆధారపడింది. దెయ్యాలు, గ్యాంగ్ స్టర్ డ్రామా మొదలైన కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినప్పటికీ దర్శకుడు మేర్లపాక గాంధీ మెయిన్ టార్గెట్ మాత్రం ఫన్ ఇవ్వడమేనట. ఇది కరెక్ట్ గా కనెక్ట్ అయితే వసూళ్ల వర్షమే.  

This post was last modified on August 4, 2026 1:00 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago