Political News

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న పీకే… ఇప్పుడు ఏకంగా చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించారు. వెరసి ఎమ్మెల్యేగా ఆయన తన కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టైంది. నిన్నటిదాకా స్ట్రాటజిస్ట్ గా పిలిపించుకున్న పీకే ఇకపై ఎమ్మెల్యేగా పిలిపించుకోనున్నారు.

విద్యాధికుడైన ప్రశాంత్ కిశోర్… రాజకీయ వ్యూహ రచనలో ఆరితేరిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే… ఎన్డీఏ విజయానికి అవసరమైన వ్యూహాన్ని రచించారు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించగా…పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఏపీలో నాటి, నేటి విపక్షం వైసీపీకి వ్యూహాలు రచించిన పీకే… ఏపీలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి వ్యూహ రచనకు దూరంగా జరిగిన పీకే తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లోకి దిగిపోయారు. అధికార జేడీయూలో చేరి… కొన్నాళ్లకే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి… కొంత సమయం తీసుకుని జన సురాజ్ పేరిట సొంత పార్టీని పెట్టుకున్నారు. 

ఇదంతా గతం అయితే… జన సురాజ్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థిగా తాజాగా పీకే తొలిసారి బరిలోకి దిగారు. బీహర్, గుజరాత్, మధ్య ప్రదేశ్ లలో ఒక్కో అసెంబ్లీ చొప్పున మూడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉధయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీహార్ లోని బంకీపూర్ నుంచి జన సురాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీకే విజయం సాధించారు. కతన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,246 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ రెండో స్థానానికి పరిమితం కాగా.. ఆర్డేడీ అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రశాంత్ కిశోర్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన సందర్భంలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. పీకే గెలిచింది బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బంకీపూర్ నుంచే కావడం గమనార్హం. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉండగానే… బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కించుకున్న నితిన్… ఈ ఏప్రిల్ మాసంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వెనక్కు నెట్టేసిన పీకే.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా కొనసాగుతూ వస్తోంది. 1995 నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అలాంటి చోట బీజేపీని ఓడించి పీకే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం.

This post was last modified on August 3, 2026 8:08 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago