Trends

బీసీసీఐ ఖజానా: ఎన్ని వేలకోట్లో తెలుసా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతోంది. 2019లో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.6,000 కోట్ల నిధి.. ఐదు సంవత్సరాల్లో మూడింతలు పెరిగి రూ.20,686 కోట్లకు చేరింది. క్రికెట్ ఆడకపోయినా, క్రికెట్ చుట్టూ తిరిగే వ్యాపారాలు బీసీసీఐని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో బోర్డు 1,623 కోట్ల లాభం ఆర్జించింది. ఇది ముందు లాభం అయిన 1,167 కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి వచ్చిన ఆదాయం, ఐసీసీ నుంచి లభించే పంపిణీలు, అలాగే పెట్టుబడులపై వచ్చిన రాబడులు బీసీసీఐ ఖజానా బరువు పెంచాయి. గత ఏడాదిలోనే రూ.4,193 కోట్ల అదనపు సంపాదన నమోదు కావడం గమనార్హం.

కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, బీసీసీఐ సాధారణ నిధి కూడా దాదాపు రెండింతలు పెరిగింది. 2019లో 3,906 కోట్లు ఉండగా 2024 నాటికి 7,988 కోట్లకు చేరింది. అయితే, బోర్డు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. 2023-24 సంవత్సరానికి మాత్రమే ఆదాయపన్ను బకాయిల కోసం 3,150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. కోర్టు కేసులు, ట్రైబ్యునల్‌లో జరుగుతున్న వాదోపవాదాల మధ్య కూడా ఈ నిధిని విడిగా ఉంచడం బీసీసీఐ ఆర్థిక శక్తిని చూపిస్తోంది.

అయితే మీడియా హక్కుల ఆదాయం మాత్రం తగ్గింది. 2022-23లో 2,524 కోట్లుగా ఉన్న ఈ మొత్తం, హోమ్ మ్యాచ్‌లు తక్కువగా ఉండటంతో 813 కోట్లకే పరిమితమైంది. కానీ పెట్టుబడులపై రాబడి 986 కోట్లకు పెరగడం ఆ లోటును కొంత భర్తీ చేసింది. మరోవైపు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు భారీగా నిధులు విడుదల చేసింది. గతేడాది మాత్రమే 1,990 కోట్లను కేటాయించగా, ఈ ఏడాది 2,013 కోట్ల పంపిణీ జరగనుంది.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 1,200 కోట్లు, ప్లాటినం జూబిలీ బెనివోలెంట్ ఫండ్ కోసం 350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించడం బీసీసీఐ బలాన్ని చూపుతోంది. ఒకప్పుడు కేవలం ఆటను నడిపించే సంస్థగా ఉన్న బీసీసీఐ, ఇప్పుడు ఆర్థిక శక్తివంతమైన సామ్రాజ్యంలా మారింది. ఆటగాళ్లు, రాష్ట్ర సంఘాలు, అభిమానులు అందరికీ లాభపడేలా నిధులను వినియోగించడం విశేషం.

This post was last modified on September 7, 2025 4:02 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

3 hours ago