Trends

కని పెంచిన తల్లిదండ్రులే ప్రాణాలు తీసారు

తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలచివేశాయి. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకులే మద్యం, మత్తు వ్యసనాలకు బానిసై నిత్యం వేధింపులకు దిగడంతో.. చివరకు కన్నబిడ్డలనే హత్య చేసే పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలోని సూర్యాపేట పట్టణం సుందరయ్యనగర్‌లో భూక్యా అచ్చి అనే మహిళ తన కుమారుడు విజయ్‌ను గొడ్డలితో నరికి చంపింది. భర్త మరణం తర్వాత కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన ఆమె, కొడుకు తనకు అండగా ఉంటాడని ఆశపడింది. అయితే ఇంటర్ వరకు చదివిన విజయ్ మద్యం, మత్తు పదార్థాలకు బానిసై ప్రతిరోజూ డబ్బు కోసం తల్లిని వేధిస్తున్నాడని సమాచారం. ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన అచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అదేరోజు గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తులో నిత్యం తల్లిదండ్రులతో గొడవపడుతూ, రెండు సెంట్ల భూమిని తన పేరుపై రాయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మరోసారి జరిగిన ఘర్షణలో తల్లిదండ్రులే అతని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం, మత్తు వ్యసనాలు కుటుంబ బంధాలను ఛిద్రం చేస్తున్నాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులే, చివరకు వారి వేధింపులు భరించలేక హంతకులుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం రెండు కుటుంబాలలో జరిగిన విషాదం మాత్రమే కాదు.. వ్యసనాలు, కుటుంబ హింస, మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకర స్థాయికి చేరాయో చెప్పే హెచ్చరిక…!

This post was last modified on July 16, 2026 1:13 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

53 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

8 hours ago