Political News

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండటం, ఆయా అంశాలపై కీలక నిర్ణయాలను కేడర్ తో పంచుకోవడం వంటి పలు కీలక పనులను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ సూపర్ యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గురువారం నాటి పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆవిష్కరించారు. జగన్ 2.0 సూపర్ యాప్ అని దీనికి పేరు పెట్టారు.

రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా యాప్ తరహా టెక్నాలజీ కొత్తేమీ కాదు. చాలా పార్టీలు తమ కేడర్ కోసం, తమ ఐడియాలజీని క్షేత్రస్థాయిలోని కేడర్ దాకా చేరవేయడం, పార్టీ కేడర్ కు అందించే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదు తదితరాల కోసం దాదాపుగా అన్ని పార్టీలు యాప్ తరహా ఏర్పాట్లను చేసుకొంటున్నాయి. అందులో భాగంగానే వైసీపీ తన యాప్ నూ ప్రారంభించింది. జగన్ 2.0 సూపర్ యాప్ పేరిట ప్రారంభించిన ఈ యాప్ ను పార్టీ కార్యకర్తలంతా డౌన్ లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.

జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన సందర్భంగా దాని ద్వారా ఏమేం చేస్తామన్న విషయాన్ని కూడా జగన్ ఓ మోస్తరుగా వివరించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం యమా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీకి అనుకూలంగా సాగుతున్న పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా పార్టీకి ఓ రేంజిలో సహకారం అందిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయా పోస్టులను ఎడిట్ చేసో, వక్రీకరించో వాటిపై విష ప్రచారం చేస్తున్నారని… ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఈ తరహా యత్నాలను సూపర్ యాప్ ద్వారా అదిగమించవచ్చని జగన్ చెప్పారు. 

జగన్ 2.0 సూపర్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం పార్టీ అధినాయకత్వంతో క్షేత్రస్థాయి కార్యకర్తను అనుసంధానించడమేనని చెప్పాలి. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ యాప్ ద్వారా పార్టీ చివరి స్థాయిలో ఉండే కేడర్ కు నేరుగా చేరవేయడం ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అంటే… పార్టీ తీసుకునే ఏ కీలక నిర్ణయంపై అయినా పార్టీ కేడర్ తప్పుగా అర్థం చేసుకోవడమనే సమస్య ఉండదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా పార్టీ కేడర్ పై జరిగే దౌర్జన్యాలు, వేధింపులను కూడా ఈ యాప్ లో పొందుపరచడం ద్వారా పార్టీ కేడర్ కు మరింత వెన్నుదన్ను అందించినట్టు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం ఇప్పటికే డిజిటల్ డైరీని వైసీపీ ఏర్పాటు చేయగా…ఇప్పుడు దానిని ఈ సూపర్ యాప్ కు అనుసంధానం చేయనున్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు.

This post was last modified on July 16, 2026 6:06 pm

Share

Recent Posts

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

3 minutes ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

18 minutes ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

1 hour ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

2 hours ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

3 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

3 hours ago