Political News

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో తొట్ట‌తొలి హైడ్రోజ‌న్ రైలు సాకారం!. 2004-14 మ‌ధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైడ్రోజ‌న్ రైలును తీసుకురావాల‌ని ప్ర‌ణాళిక‌లు చేసింది. కానీ, సాకారం కాలేదు. ఆ త‌ర్వాత ప‌గ్గాలుచేప‌ట్టిన మోడీ.. కేవ‌లం 5 సంవ‌త్స‌రాల్లోనే హైడ్రోజ‌న్ రైలు సాకారానికి న‌డుంబిగించారు. తాజాగా ఈ రైలు అందుబాటులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం ప్ర‌ధాన మంత్రి మోడీ.. హ‌రియాణాలో  తొలి న‌మో హైడ్రొజ‌న్ రైలును ప్రారంభించ‌నున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వాహ‌న వినియోగం పెరుగుతోంది. ఈ క్ర‌మంలో మ‌న దేశంలో కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, వాయుకాలుష్యం త‌గ్గించాల‌న్న ఐక్య‌రాజ్య‌స‌మితి తీర్మానం మేర‌కు 2030 నాటికి క‌ర్బ‌న ఉద్గారాల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. దీనిలో భాగంగానే దేశ‌వ్యాప్తంగా ఇటు వ్య‌క్తిగ‌త‌, అటు ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల్లోనూ.. ఎల‌క్ట్రిక్ స‌హా.. హ‌రిత ఇంధ‌న వినియోగ వాహ‌నాల‌ను ప్రోత్స‌హిస్తోంది.

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వినియోగించే అతి పెద్ద ప్ర‌జారవాణా వ్య‌వ‌స్థ భారతీయ‌ రైల్వే. క‌శ్మీరు నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను క‌లుపుతూ.. న‌డిచే రైళ్లలో.. ప్ర‌స్తుతం విద్యుత్‌, డీజిల్ వంటి సంప్ర‌దాయ ఇంధ‌నాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం హ‌రిత ఇంధ‌న రైళ్ల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని సంక‌ల్పించింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా శుక్ర‌వారం తొలి హ‌రింత ఇంధ‌న హైడ్రోజ‌న్ రైలుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ్రీకారం చుట్ట‌నున్నారు.

హరియాణాలోని జింద్- సోనిపట్ మధ్య తొలి హైడ్రోజ‌న్ రైలు శుక్ర‌వారం ప్ర‌యాణించ‌నుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. అత్యంత శక్తివంతమైన ఈ  హైడ్రోజన్ రైలును ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా స్వ‌దేశీ ప‌రిక‌రాలు, సాంకేతిక‌త‌తో నిర్మించారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హానీ క‌ల‌గ‌ని రీతిలో ఈ రైలును రూపొందించ‌డం విశేషం.

డీజిల్, బొగ్గు వినియోగానికి బదులు.. పునరుత్పాదక ఇంధనంతో తయారుచేసిన హైడ్రోజన్‌ను ఈ రైలులో ఇంధనంగా వినియోగిస్తారు. దీనికిగాను ప్ర‌త్యేక హైడ్రోజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశారు. హైడ్రోజ‌న్ వినియోగంతో ఎటువంటి కర్బన ఉద్గారాలు విడుదల కావని రైల్వే శాఖ పేర్కొంది. ఇక‌,  ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. మొత్తం 10 బోగీల‌తో నిర్మించిన న‌మో హైడ్రోజ‌న్ రైలుకు కేంద్ర ప్ర‌భుత్వం 136 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసింది. హైద‌రాబాద్‌కు చెందిన సంస్థే దీనిని రూపొందించ‌డం విశేషం.

దేశంలో తొలి హైడ్రోజ‌న్ రైలు రాక‌తో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి రైళ్లు ఉన్న కొద్ది దేశాల స‌ర‌స‌న భార‌త్ స‌గ‌ర్వంగా నిల‌వ‌నుంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, జపాన్, చైనాల‌లోనే  హైడ్రోజ‌న్ రైళ్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఇప్పుడు మ‌న దేశంలోనూ హైడ్రోజ‌న్ రైలు అందుబాటులోకి రానుంది. ఇది పూర్తిగా మోడీ ఖాతాలోనే ప‌డ‌నుంది. అందుకే.. మోడీని విశ్వ‌గురు అంటున్నారంటూ.. బీజేపీ ప్ర‌శంస‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. కాగా, త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా మ‌రిన్ని హైడ్రోజ‌న్ రైళ్ల‌ను ప్ర‌వేశ పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

Kumar

Recent Posts

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

1 hour ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

3 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

3 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

4 hours ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

4 hours ago

ప్రభాస్ పోస్టర్ ఏం చెబుతోంది

అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…

5 hours ago