భారత్ ఐటీ రంగం విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. 5.6 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కారు ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్‌లు విధించవచ్చనే ప్రచారం వ్యాపిస్తోన్న వేళ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంగా స్పందించారు. ఐటీ రంగాన్ని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
భారత ఐటీ సేవల రంగం దేశానికి పెద్ద ఎత్తున ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో వంటి దిగ్గజ సంస్థలకు 60% వరకు ఆదాయం అమెరికా నుంచే వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో టారిఫ్‌లు నిజమైతే, సంస్థలు రెండుసార్లు పన్నుపోటు బారిన పడతాయి. వీసా నిబంధనలు, స్థానిక నియామకాలతో కలిపి ఇప్పటికే ఖర్చులు పెరిగిపోతున్నాయి.
మంత్రి వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ ప్రభుత్వం కేవలం అమెరికాతోనే కాదు, యూరప్, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను భారత్‌లో నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయి. ఇది రంగానికి స్థిరత్వం కల్పించేందుకు తీసుకుంటున్న వ్యూహాత్మక చర్య అని ఆయన తెలిపారు.
అమెరికా నుంచి వచ్చే ముప్పు నిజమైనా, అంత ఈజీ కాదు అని నిపుణులు చెబుతున్నారు. సరుకుల దిగుమతుల మాదిరిగా ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై టారిఫ్‌లు విధించడం కష్టం. ఎందుకంటే, అమెరికా దిగ్గజ కంపెనీలకే భారత నిపుణుల సహకారం తప్పనిసరి. హెచ్1బీ వీసాలతో అక్కడికి వెళ్ళినా, లేదా రిమోట్‌గా పనిచేసినా, భారత నైపుణ్యాన్ని వారు వదులుకోలేరు.
మొత్తం మీద, అమెరికా టారిఫ్‌ల భయం నిజమే అయినా, ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వైష్ణవ్ హామీ ఇవ్వడం రంగానికి ఊరటనిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం ఐటీపై మాత్రమే ఆధారపడకుండా, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమతుల్యతే భారత టెక్ ఎకానమీకి భవిష్యత్తులో బలమైన పునాదిగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 7, 2025 4:30 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…